కార్మిక చట్టాన్ని అతిక్రమించిన 403 మంది పట్టివేత
- August 11, 2016
మస్కట్ - మ్యాన్‌పవర్ మంత్రిత్వ శాఖ ( ఎం ఓ ఎం) జాయింట్ తనిఖీ బృందం తమ వారాంతపు నివేదిక లో 403 మంది కార్మికులు జూలై 31 వ తేదీ నుండి ఆగస్టు 6 వ తేదీల మధ్య కార్మిక చట్టాన్ని అతిక్రమించినట్లు తెలిపారు. వీరిలో వాణిజ్య అవసరాలకోసం కార్మికులు ( 314 మంది ) ఇంట్లో పనిచేసే సహాయకులు ( 54 మంది ), వ్యవసాయ క్షేత్రాలలో పనిచేసే కార్మికులు ( 35 మంది ) ఈ జాబితాలో ఉన్నారు. తనిఖీ బృందాలు ఆకస్మిక దాడి జరిపినపుడు 379 మంది కార్మికులు పట్టుబడ్డారు. వీరిలో 216 మంది పరారీలో ఉన్న కార్మికులు కాగా , వీరిలో 157 మంది తిరిగి విధుల్లో చేరిన కార్మికులు ఉన్నారు.వీరిలో కూడా కూడా ఇతర ఉల్లంఘనలకు పాల్పడిన ఆరుగురు కార్మికులు పట్టుబడ్డారు. మస్క్యాట్ గవర్నేట్ లో (173 మంది ) ఉత్తర బాతినాహ (84 మంది ) ఉల్లంఘనలు అత్యధిక సంఖ్యలో చూసింది. మ్యాన్‌పవర్ మంత్రిత్వ శాఖ ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన ప్రక్రియలకు ప్రోత్సహిస్తోంది.
ఇదికాకుండా , 381 మంది కార్మికులు కూడా కార్మిక చట్టం యొక్క నిబంధనలు ఉల్లంఘించినందుకు దేశమునుండి బహిష్కరించబడ్డారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







