కార్మిక చట్టాన్ని అతిక్రమించిన 403 మంది పట్టివేత

- August 11, 2016 , by Maagulf
కార్మిక చట్టాన్ని అతిక్రమించిన 403 మంది పట్టివేత

మస్కట్ - మ్యాన్పవర్ మంత్రిత్వ శాఖ ( ఎం ఓ ఎం) జాయింట్ తనిఖీ బృందం తమ  వారాంతపు  నివేదిక లో  403 మంది  కార్మికులు జూలై 31 వ  తేదీ నుండి  ఆగస్టు 6 వ తేదీల మధ్య  కార్మిక చట్టాన్ని అతిక్రమించినట్లు తెలిపారు. వీరిలో వాణిజ్య అవసరాలకోసం కార్మికులు ( 314 మంది ) ఇంట్లో పనిచేసే సహాయకులు ( 54 మంది  ), వ్యవసాయ క్షేత్రాలలో పనిచేసే  కార్మికులు ( 35 మంది ) ఈ జాబితాలో ఉన్నారు. తనిఖీ బృందాలు ఆకస్మిక దాడి జరిపినపుడు 379 మంది కార్మికులు పట్టుబడ్డారు. వీరిలో 216 మంది పరారీలో ఉన్న కార్మికులు కాగా , వీరిలో 157 మంది తిరిగి విధుల్లో చేరిన కార్మికులు ఉన్నారు.వీరిలో కూడా  కూడా ఇతర ఉల్లంఘనలకు పాల్పడిన  ఆరుగురు  కార్మికులు పట్టుబడ్డారు. మస్క్యాట్ గవర్నేట్ లో (173 మంది  ) ఉత్తర బాతినాహ (84 మంది  )  ఉల్లంఘనలు అత్యధిక సంఖ్యలో చూసింది. మ్యాన్పవర్ మంత్రిత్వ శాఖ ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన ప్రక్రియలకు  ప్రోత్సహిస్తోంది.

ఇదికాకుండా , 381 మంది  కార్మికులు కూడా కార్మిక చట్టం యొక్క నిబంధనలు  ఉల్లంఘించినందుకు దేశమునుండి బహిష్కరించబడ్డారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com