‘ది ఇండియా స్టోరీ’ టీజర్ వచ్చేసింది..

- June 26, 2026 , by Maagulf
‘ది ఇండియా స్టోరీ’ టీజర్ వచ్చేసింది..

కాజల్ అగర్వాల్, శ్రేయాస్ తల్పడే ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా ‘ది ఇండియా స్టోరీ’. స్లో పాయిజన్ ఇన్ ప్రోగ్రెస్ అనేది ట్యాగ్ లైన్. జీ స్టూడియోస్ సమర్పణలో ఎంఐజీ ప్రొడక్షన్ & స్టూడియోస్‌ బ్యానర్ పై సాగర్ బి. షిండే నిర్మాణంలో చేతన్ డీకే దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసారు.

ది ఇండియా స్టోరీ సినిమా 2026 జూలై 24న ప్రపంచవ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. మీరు కూడా ఈ సినిమా టీజర్ చూసేయండి.

ఈ టీజర్ చూస్తుంటే పురుగుమందుల ఆధారిత వ్యవసాయం (పెస్టిసైడ్ ఫార్మింగ్), దాని వల్ల ప్రజలపై పడుతున్న ప్రభావం ఈ సినిమా కథ అని తెలుస్తుంది. పురుగుమందుల ఆధారిత వ్యవసాయం వల్ల పండిన పంట తిని ఓ పాప చనిపోతే ఆమె కోసం పోరాటం చేసే న్యాయవాది పాత్రలో కాజల్ కనిపించనుంది. ఈ సినిమాలో కాజల్ తన పర్ఫార్మెన్స్ తో అదరగొట్టబోతుందని తెలుస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com