కువైట్ లో రోడ్ మెయింటనెన్స్ డ్రైవ్ వేగవంతం..!!
- June 26, 2026
కువైట్: కువైట్ వ్యాప్తంగా రోడ్ మెయింటనెన్స్ డ్రైవ్ ను వేగవంతం చేశారు. తన కొత్త రహదారి అభివృద్ధి కాంట్రాక్టుల కింద ప్రధాన మౌలిక సదుపాయాల నవీకరణ పనులను వేగవంతం చేస్తున్నట్లు పబ్లిక్ వర్క్స్ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రిత్వ శాఖ ఇటీవల విస్తృతమైన నిర్వహణ పనులను పూర్తి చేసి, సబా అల్-సలేం మరియు అల్-మసయేల్‌ను ఫహహీల్ రోడ్‌తో కలిపే రహదారిని తిరిగి తెరిచినట్లు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా దెబ్బతిన్న రోడ్ లేయర్స్ ను మార్చడం, బేస్ లేయర్‌లకు ట్రీట్‌మెంట్ చేయడం మరియు ఆధునిక ఇంజనీరింగ్ ప్రమాణాలకు అనుగుణంగా రోడ్డు పక్కన ఉండే ఖాళీ స్థలాలు (రోడ్ షోల్డర్లు), మార్కింగ్‌లు మరియు ట్రాఫిక్ సిగ్నల్స్ ను అప్‌గ్రేడ్ చేయడం వంటివి ఉన్నాయని మంత్రిత్వశాఖ పేర్కొంది.
దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఈ కార్యక్రమం రహదారి నాణ్యతను మెరుగుపరచడం, ట్రాఫిక్ భద్రతను పెంచడం మరియు దేశంలోని వివిధ ప్రాంతాలలో ట్రాఫిక్ ప్రవాహ సామర్థ్యాన్ని పెంచడం లక్ష్యమని మంత్రిత్వ శాఖ తెలిపింది. వాహనదారులు కార్మికుల భద్రతను దృష్టిలో పెట్టుకొని రోడ్ మెయింటనెన్స్ పనులు జరిగే ప్రాంతాలలో ట్రాఫిక్ నిబంధనలు మరియు వేగ పరిమితులను పాటించాలని కోరారు.
తాజా వార్తలు
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!
- యువతలో పెరుగుతున్న కొలొరెక్టల్ క్యాన్సర్‌కు వాపు కారణమా?
- బహ్రెయిన్‌లో స్మగ్లింగ్.. శరీరంలో 22 క్యాప్సూల్స్.. జీవిత ఖైదు..!!
- ఏషియన్ గేమ్స్‌లో చరిత్ర సృష్టించిన నీరూదండా..
- భారత్–యూఏఈ రక్షణ సహకారం పై కీలక చర్చలు..







