3 ఆఫ్రికా దేశాలకు ప్రయాణాలపై సౌదీ అరేబియా నిషేధం..!!

- June 26, 2026 , by Maagulf
3 ఆఫ్రికా దేశాలకు ప్రయాణాలపై సౌదీ అరేబియా నిషేధం..!!

రియాద్: ఎబోలా వైరస్ వ్యాప్తిని నివారించే ముందుజాగ్రత్త చర్యలలో భాగంగా కాంగో, ఉగాండా మరియు దక్షిణ సూడాన్‌లకు ప్రయాణించడాన్ని సౌదీ అరేబియా నిలిపివేసింది. అదే సమయంలో ఈ మూడు దేశాల నుండి వచ్చే వారికి సైతం అన్ని రకాల వీసాల జారీని కూడా నిలిపివేసింది.

ఎబోలా వ్యాప్తికి సంబంధించిన ప్రమాదాలను తగ్గించడానికి తీసుకుంటున్న అదనపు ముందుజాగ్రత్త చర్యలలో ఇవి కూడా భాగమని ప్రకటించింది. కొత్తగా ప్రవేశపెట్టిన ఈ ఆంక్షలు, సౌదీలోకి ప్రవేశించడానికి 21 రోజుల ముందు వరకు ఈ మూడు ప్రభావిత దేశాలలో పర్యటించిన ఇతర దేశాల ప్రయాణికులకు కూడా వర్తిస్తాయని స్పష్టం చేసింది.

సౌదీలో ప్రజారోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని, ఎబోలాకు సంబంధించిన నిర్ధారిత లేదా అనుమానిత కేసులు ఏవీ నమోదు కాలేదని పేర్కొంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com