చైనాలో స్టీమ్ పైప్ పేలి 21 మంది మృతి

- August 11, 2016 , by Maagulf
చైనాలో స్టీమ్ పైప్ పేలి 21 మంది మృతి

చైనాలో భారీ పేలుడు కారణంగా 21 మంది ప్రాణాలు కోల్పోయారు. సెంట్రల్‌ చైనాలోని హుబై ప్రావిన్స్‌లో ఒత్తిడి ఎక్కువై స్టీమ్‌ పైపు పేలడంతో ఈ ప్రమాదం సంభవించింది. ప్రావిన్స్‌లోని దన్‌యాంగ్‌ నగరంలోని పవర్‌ స్టేషన్‌ సమీపంలో ఈ పేలుడు సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. ఘటనలో 21 మంది మరణించగా, ఐదుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుడికి దారితీసిన కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.
ఇటీవల కాలంలో చైనాలో పరిశ్రమల్లో ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. గత ఏడాది తియాంజిన్‌ నగరంలోని రసాయన కర్మాగారంలో భారీ పేలుళ్లు సంభవించి 173 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com