ఒమన్‌లో భారీ అగ్నిప్రమాదం.. రెండు ట్రక్కులు, మరో వాహనం దగ్ధం..!!
- November 27, 2026
మస్కట్: ఒమన్‌లోని నార్త్ అల్ బాతినా గవర్నరేట్‌లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మయ్హా బని ఖయూమ్ ప్రాంతంలోని హైవేపై రెండు ట్రక్కులు, మరో వాహనం మంటల్లో చిక్కుకున్నాయి. సమాచారం అందుకున్న సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ విభాగం సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
అగ్నిప్రమాదం అనంతరం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అగ్నిమాపక సిబ్బంది కూలింగ్ ప్రక్రియ చేపట్టారు. పరిసర ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని భద్రతా చర్యలు కొనసాగిస్తున్నారు.
ఈ ఘటనలో ఓ వ్యక్తికి మధ్యస్థంగా గాయాలయ్యాయి. అంబులెన్స్ సిబ్బంది అతడిని సమీపంలోని ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు, వాహనాలకు జరిగిన నష్టం వివరాలు వెల్లడికావాల్సి ఉంది.
తాజా వార్తలు
- సౌదీపై హౌతీల దాడి..నేపాల్ కార్మికుడు మృతి, పలువురికి గాయాలు..!!
- ఖతార్‌లో ఊపందుకుంటున్న సినీ పరిశ్రమ..!!
- యూఏఈలో రోడ్డు ప్రమాదాల నివారణకు కొత్త ట్రాఫిక్ నిబంధనలు..!!
- ఒమన్‌లో భారీ అగ్నిప్రమాదం.. రెండు ట్రక్కులు, మరో వాహనం దగ్ధం..!!
- కువైట్‌లో అల్ రాయ్ పక్షుల మార్కెట్ శాశ్వతంగా మూసివేత..!!
- బహ్రెయిన్‌లో కార్మికులకు వర్క్ వీసా..ఎంపీ కీలక ప్రతిపాదన..!!
- డ్రగ్స్ రహిత భారత్ లక్ష్యంగా ‘హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్’..
- హైదరాబాద్‌లో ‘సైబరాబాద్ మూవ్స్ 2026’ ప్రారంభం..సుస్థిర రవాణాకు కార్పొరేట్ల ప్రతిజ్ఞ
- త్వరలో 25 వేల ఉద్యోగాలు..సీఎం రేవంత్ కీలక ప్రకటన
- సొంతూరి అభివృద్ధికి చిత్తర్వు కుటుంబీకుల సంకల్పం







