కువైట్‌లో అల్ రాయ్ పక్షుల మార్కెట్ శాశ్వతంగా మూసివేత..!!
- November 27, 2026
కువైట్ : కువైట్‌లోని అల్ రాయ్ ప్రాంతంలో ఉన్న పక్షుల మార్కెట్‌ను శాశ్వతంగా మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పర్యావరణ నిబంధనల ఉల్లంఘనలు, ప్రజారోగ్యం, భద్రతకు సంబంధించిన సమస్యలు గుర్తించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. 2026 డిసెంబర్ 1 నుంచి మార్కెట్ మూసివేత అమల్లోకి రానుంది. కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ అగ్రికల్చరల్ అఫైర్స్ అండ్ ఫిష్ రిసోర్సెస్ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
మార్కెట్‌ను సందర్శించే ప్రజలు, అక్కడ పనిచేసే వ్యాపారుల ఆరోగ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ చర్య చేపట్టినట్లు వెల్లడించింది. అథారిటీ తాత్కాలిక డైరెక్టర్ జనరల్ ఫాయ్ అల్ మస్బాహీ జారీ చేసిన అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్ నంబర్ 970 ఆఫ్ 2026 ప్రకారం.. మార్కెట్లోని దుకాణాలను ఖాళీ చేయించే ప్రక్రియ ప్రారంభించనున్నారు. గుర్తించిన ఉల్లంఘనలను సంబంధిత అధికారుల సమన్వయంతో తొలగించనున్నారు.
మార్కెట్లోని దుకాణాల యజమానులు మూసివేత నిర్ణయాన్ని తప్పనిసరిగా పాటించాలని అధికారులు ఆదేశించారు. నిర్ణయం జారీ చేసిన తేదీ నుంచి గరిష్ఠంగా రెండు నెలల్లోగా దుకాణాలను పూర్తిగా ఖాళీ చేసి, అందులోని వస్తువులన్నింటినీ తొలగించి, అథారిటీకి చెందిన జంతు ఆరోగ్య విభాగం అధికారులకు అప్పగించాల్సి ఉంటుంది.
అలాగే ప్రస్తుతం కొనసాగుతున్న అన్ని దుకాణాల లైసెన్సులను నిబంధనల ప్రకారం రద్దు చేసేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖతో సమన్వయం చేసుకోవాలని నిర్ణయంలో పేర్కొన్నారు. డిసెంబర్ 1 నుంచి మార్కెట్ కార్యకలాపాలు నిలిచిపోనుండటంతో అల్ రాయ్ పక్షుల మార్కెట్లో వ్యాపారాలు నిర్వహిస్తున్న దుకాణదారులు తమ కార్యకలాపాలను నిలిపివేయాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- యూఏఈలో రోడ్డు ప్రమాదాల నివారణకు కొత్త ట్రాఫిక్ నిబంధనలు..!!
- ఒమన్‌లో భారీ అగ్నిప్రమాదం.. రెండు ట్రక్కులు, మరో వాహనం దగ్ధం..!!
- కువైట్‌లో అల్ రాయ్ పక్షుల మార్కెట్ శాశ్వతంగా మూసివేత..!!
- బహ్రెయిన్‌లో కార్మికులకు వర్క్ వీసా..ఎంపీ కీలక ప్రతిపాదన..!!
- డ్రగ్స్ రహిత భారత్ లక్ష్యంగా ‘హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్’..
- హైదరాబాద్‌లో ‘సైబరాబాద్ మూవ్స్ 2026’ ప్రారంభం..సుస్థిర రవాణాకు కార్పొరేట్ల ప్రతిజ్ఞ
- త్వరలో 25 వేల ఉద్యోగాలు..సీఎం రేవంత్ కీలక ప్రకటన
- సొంతూరి అభివృద్ధికి చిత్తర్వు కుటుంబీకుల సంకల్పం
- దుబాయ్‌లో బరువు తగ్గించే ఉత్పత్తిపై నిషేధం..!!
- ఇరాన్ డ్రోన్ దాడిలో గాయపడ్డ ఇద్దరు ఇటలీ పౌరులు మృతి..!!







