తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- June 30, 2026
హైదరాబాద్: తెలంగాణ స్పెషల్ పోలీస్ (TGSP) పనితీరును రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా కార్యాచరణ సన్నద్ధత, మౌలిక సదుపాయాలు, సాంకేతిక పరిజ్ఞానం, శిక్షణ, సిబ్బంది సంక్షేమం వంటి అంశాలపై అధికారులతో విస్తృతంగా చర్చించారు.
సమీక్షలో భాగంగా టీజీఎస్పీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన డీజీపీ, కీలక కార్యాచరణ విభాగాలు, సహాయక మౌలిక సదుపాయాలను పరిశీలించారు. అనంతరం అధికారులు సమర్పించిన ప్రజెంటేషన్లను వీక్షించి, వివిధ అవసరాలపై వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ, తెలంగాణ స్పెషల్ పోలీస్‌కు చెందిన 13 ప్రత్యేక బెటాలియన్లు రాష్ట్ర పోలీసు వ్యవస్థకు వెన్నెముకలాంటివని పేర్కొన్నారు. నక్సల్స్‌కు వ్యతిరేకంగా జరిగిన పోరాటం నుంచి భారీ ఉత్సవాలు, ప్రత్యేక కార్యక్రమాలు, ప్రకృతి విపత్తులు, శాంతిభద్రతల నిర్వహణ వరకు టీజీఎస్పీ సిబ్బంది అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించారని కొనియాడారు.
భవిష్యత్ సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు శిక్షణ, సాంకేతిక సామర్థ్యాలు, శారీరక దృఢత్వం, మానసిక స్థైర్యాన్ని మరింత పెంపొందించాల్సిన అవసరం ఉందని డీజీపీ సూచించారు.
అలాగే, సిబ్బంది సంక్షేమానికి అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాలని సీనియర్ అధికారులను ఆదేశించారు. నివాస సౌకర్యాలను మెరుగుపరచడం, ఖాళీ పోస్టులను త్వరితగతిన భర్తీ చేయడం, విధుల కేటాయింపులో పారదర్శకత పాటించడం, ఒత్తిడిని తగ్గించేందుకు మిత్ర కౌన్సెలింగ్ కేంద్రాలను మరింత బలోపేతం చేయడం, అవసరమైన సమయంలో సిబ్బందికి తక్షణ సహాయం అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్‌పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్‌లైన్‌గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు







