యూఏఈలో భారత పాస్‌పోర్ట్ ఫీజులు పెంపు..
- June 30, 2026
దుబాయ్: యూఏఈలో భారతీయులకు అందించే పాస్‌పోర్ట్ సేవల ఫీజులను భారత ప్రభుత్వం పెంచింది. కొత్త ఫీజులు జూలై 1, 2026 నుంచి అమల్లోకి వస్తాయని దుబాయ్‌లోని భారత కాన్సులేట్ జనరల్ మంగళవారం ప్రకటించింది.
ఈ కొత్త ఫీజులు అబుదాబిలోని భారత రాయబార కార్యాలయం, దుబాయ్‌లోని భారత కాన్సులేట్, అలాగే యూఏఈలోని అన్ని ఇండియన్ కాన్సులర్ అప్లికేషన్ సెంటర్ల (ICACs)లో ఒకే విధంగా అమలుకానున్నాయి.
కొత్త పాస్‌పోర్ట్ ఫీజులు
36 పేజీల సాధారణ పాస్‌పోర్ట్‌కు సాధారణ (నార్మల్) సేవలో 450 దిర్హామ్‌లు, తత్కాల్ సేవలో 900 దిర్హామ్‌లు చెల్లించాల్సి ఉంటుంది. ఇంతకుముందు ఈ ఫీజు 285 దిర్హామ్‌లు ఉండేది.
60 పేజీల పాస్‌పోర్ట్‌కు సాధారణ సేవలో 630 దిర్హామ్‌లు, తత్కాల్‌లో 1,080 దిర్హామ్‌లుగా నిర్ణయించారు.
పోయిన లేదా దెబ్బతిన్న పాస్‌పోర్ట్‌కు అధిక ఫీజులు
పాస్‌పోర్ట్ పోయిన లేదా దెబ్బతిన్న సందర్భంలో 36 పేజీల పాస్‌పోర్ట్‌కు 900 దిర్హామ్‌లు, 60 పేజీల పాస్‌పోర్ట్‌కు 1,080 దిర్హామ్‌లు సాధారణ సేవలో చెల్లించాలి. తత్కాల్ సేవలో వరుసగా 1,350 దిర్హామ్‌లు, 1,530 దిర్హామ్‌లు చెల్లించాల్సి ఉంటుంది.
చిన్నారుల పాస్‌పోర్ట్ ఫీజుల్లో మార్పులు
18 సంవత్సరాల లోపు పిల్లలకు 36 పేజీల పాస్‌పోర్ట్ సాధారణ సేవలో 325 దిర్హామ్‌లు, తత్కాల్ సేవలో 775 దిర్హామ్‌లుగా నిర్ణయించారు. ఇంతకుముందు ఈ ఫీజు 190 దిర్హామ్‌లు మాత్రమే ఉండేది.
అయితే 8 సంవత్సరాల లోపు చిన్నారుల కొత్త పాస్‌పోర్ట్ దరఖాస్తులకు 10 శాతం రాయితీ కల్పించారు. దీంతో సాధారణ సేవలో 295 దిర్హామ్‌లు, తత్కాల్‌లో 700 దిర్హామ్‌లు మాత్రమే చెల్లించాలి. ఈ రాయితీ పాస్‌పోర్ట్ పునరుద్ధరణ (రీ-ఇష్యూ)కు వర్తించదు.
ఇతర సేవల ఫీజులు
పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ (PCC), సరెండర్ సర్టిఫికేట్, గ్లోబల్ ఎంట్రీ ప్రోగ్రామ్ ధృవీకరణ వంటి సేవల ఫీజు 95 దిర్హామ్‌ల నుంచి 145 దిర్హామ్‌లకు పెరిగింది.
అత్యవసర సర్టిఫికేట్ (ఎమర్జెన్సీ సర్టిఫికేట్) ఫీజు 60 దిర్హామ్‌లు, సర్టిఫికేట్ ఆఫ్ ఐడెంటిటీ ఫీజు 180 దిర్హామ్‌లుగా నిర్ణయించారు. ఈ రెండు సేవలకు తత్కాల్ సదుపాయం ఉండదు.
పాస్‌పోర్ట్ చెల్లుబాటు
18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారికి జారీ చేసే పాస్‌పోర్ట్ 10 సంవత్సరాలు చెల్లుబాటు అవుతుంది. చిన్నారులకు జారీ చేసే పాస్‌పోర్ట్ 5 సంవత్సరాలు లేదా వారు 18 ఏళ్లు పూర్తయ్యే వరకు, ఏది ముందైతే అది వర్తిస్తుంది.
అవుట్‌సోర్సింగ్ సేవల నిర్వహణ సంస్థ వసూలు చేసే సర్వీస్ ఛార్జీలు, అలాగే ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్ (ICWF) రుసుము ఈ ఫీజుల్లో చేరలేదని, అవి అదనంగా వర్తిస్తాయని భారత కాన్సులేట్ స్పష్టం చేసింది.
కాగా, జూలై 1 నుంచి యూఏఈలో భారత పాస్‌పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలను ‘అల్‌హింద్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎల్‌ఎల్‌సీ’ నిర్వహించనున్న నేపథ్యంలో ఈ కొత్త ఫీజులు అమల్లోకి వస్తున్నాయి. 2012 తర్వాత భారత ప్రభుత్వం పాస్‌పోర్ట్ ఫీజులను సవరించడం ఇదే మొదటిసారి.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







