తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం

- June 30, 2026 , by Maagulf
తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ రాష్ట్ర రవాణా రంగంలో సరికొత్త విప్లవానికి శ్రీకారం చుడుతూ ఒక కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇక పై రాష్ట్ర రవాణా శాఖ కొనుగోలు చేసే కొత్త బస్సులన్నీ కేవలం ఎయిర్ కండిషన్డ్ (AC) బస్సులు మాత్రమే అయి ఉండాలని ఆయన రవాణా శాఖను ఆదేశించారు.ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని తమిళనాడు రవాణా శాఖ మంత్రి విజయ్ పార్తీబన్ అధికారికంగా వెల్లడించారు. సామాన్య ప్రజలకు కూడా అత్యుత్తమ, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని అందించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి ఈ ముందడుగు వేశారని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ రవాణా వ్యవస్థను కార్పొరేట్ స్థాయికి ధీటుగా ఆధునీకరించే దిశగా తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

మారుమూల గ్రామాలకు అనుసంధానం..ప్రతి ఒక్కరికీ సౌకర్యవంతమైన ప్రయాణం!

ప్రజా రవాణా వ్యవస్థను కేవలం నగరాలకే పరిమితం చేయకుండా, రాష్ట్రంలోని ప్రతి మారుమూల గ్రామానికి విస్తరించాలని ముఖ్యమంత్రి విజయ్ స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించారు. “ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణించే ప్రతి ఒక్కరికీ సౌకర్యం లభించాలి. ఆఖరి మైలు వరకు బస్సు నెట్‌వర్క్ అనుసంధానం కావాలి. ఆ బస్సులు సామాన్యుడి నుంచి ముఖ్యమంత్రి వరకు ప్రతి ఒక్కరూ హాయిగా ప్రయాణించేలా అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండాలి” అని సీఎం ఆదేశించినట్లు మంత్రి విజయ్ పార్తీబన్ వివరించారు. ఎండ తీవ్రత, కాలుష్యం నుంచి ప్రయాణికులకు ఉపశమనం కలిగిస్తూ, తక్కువ ధరలోనే ఏసీ బస్సు ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ప్రజలు సొంత వాహనాలను పక్కనబెట్టి ప్రభుత్వ రవాణాను ఆశ్రయిస్తారని, తద్వారా పర్యావరణానికి కూడా మేలు జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com