'వానవిల్లు' వెరైటీ ప్రేమకథ
- August 11, 2016
రాహుల్ ప్రేమ్ మూవీ మేకర్స్ పతాకంపై ప్రతీక్, శ్రావ్య, శ్రీ సయ్యిని హీరో హీరోయిన్లుగా లంకా కరుణాకర్ దాస్ నిర్మాతగా ప్రతీక్ ప్రేమ్ కరణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'వానవిల్లు'. ఈ చిత్రం ఇటీవలే కేరళలో షెడ్యూల్‌ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత లంకా కరుణాకర్ దాస్ మాట్లాడుతూ..ఇదొక వెరైటీ ప్రేమకథ. టైటిల్‌కి తగ్గట్లుగానే ఈ మూవీ అందంగా, అద్భుతంగా ఉంటుంది అని అన్నారు. ఇందులో ఓ చక్కని ప్రేమకథ ఉండగా, ఈ సినిమాకి కథతో పాటు స్క్రీన్‌ప్లే కూడా చాలా చక్కగా కుదిరింది అని ఆయన అన్నారు. ఆ మధ్య మలేషియా షెడ్యూల్ లో కొంత టాకీ పార్ట్, సాంగ్స్ షూట్ చేసిన యూనిట్ కేరళ షెడ్యూల్ లో మిగిలిన టాకీ పార్ట్ పూర్తి చేసారు. నెక్స్ట్ షెడ్యూల్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుండి ఆర్.ఎఫ్.సి. లో ప్రారంభం అవుతుంది. ఆగష్టు చివరివారంలో టీజర్ ను రిలీజ్ చేయనున్నట్టు మూవీ నిర్మాతలు తెలిపారు. ప్రతీక్, శ్రావ్య, శ్రీ సయ్యిని, హేమ, ప్రభాస్ శ్రీను, సత్య, సురేఖావాణి, టిల్లు వేణు, జబర్ధస్త్ ఫణి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం ప్రభు ప్రవీణ్ అందించారు.
తాజా వార్తలు
- భారతీయుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లు
- సైనిక ప్రతీకారం 'కచ్చితంగా' చర్చకు వస్తుంది: యూఏఈ అధ్యక్షుడి దౌత్య సలహాదారు అన్వర్ గార్గాష్
- భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
- టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడికి హైదరాబాద్ కోర్టులో ఊరట
- తెలంగాణ లో మహిళా పెట్రోల్ బంకులు
- ఇద్దరు ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ సెల్స్ అరెస్ట్: ఖతార్
- 166 మిస్సైల్స్, డ్రోన్లను ధ్వంసం చేశాం: బహ్రెయిన్
- కువైట్ పై దాడులకు తెగబడ్డ ఇరాన్..!!
- కువైట్‌లో సైనికుల మృతి పట్ల ఒమన్ సంతాపం..!!
- దౌత్యాధికారులకు ఇఫ్తార్ విందు ఇచ్చిన సౌదీ అరేబియా..!!









