ఇద్దరు పైలట్లు తాగి విమానాలు నడిపినందుకు నాలుగేళ్ల పాటు సస్పెండ్..
- August 12, 2016
ఎయిరిండియా, జెట్ ఎయిర్‌వేస్‌కు చెందిన ఇద్దరు పైలట్లు తాగి విమానాలు నడిపినందుకు వాళ్లను డీజీసీఏ నాలుగేళ్ల పాటు సస్పెండ్ చేసింది. విమానం ల్యాండయిన తర్వాత వారికి చేసే పరీక్షలలో వారు వదిలిన గాలిలో ఆల్కహాల్ మోతాదు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. దీంతో ఎయిరిండియా కేబిన్ క్రూ సిబ్బందిలో ఒకరిని కూడా ఏడాది పాటు సస్పెండ్ చేశారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా రెండు ఎయిర్‌లైన్స్ సంస్థలను కూడా ఆయా పైలట్లపై ఎఫ్ఐఆర్‌లు దాఖలు చేయాల్సిందిగా డీజీసీఏ సూచించింది. ఈ రెండూ విదేశాల నుంచి వచ్చిన విమానాలేనని తెలుస్తోంది.ఈనెల పదో తేదీన షార్జా నుంచి కాలికట్ వచ్చిన ఎయిరిండియా విమానంలో పైలట్ కు విమానం దిగిన తర్వాత పరీక్షలు చేస్తే ఆల్కహాల్ పాజిటివ్ అని వచ్చింది. అలాగే ఈనెల 3న అబుదాబి నుంచి చెన్నై వచ్చిన జెట్ ఎయిర్‌వేస్ విమాన పైలట్ కూడా తాగినట్లు తేలింది. ఎయిరిండియా పైలట్‌ను గ్రౌండింగ్ చేయగానే విమానం నడిపేందుకు తగినంతమంది సిబ్బంది లేక ఇబ్బంది తలెత్తింది. తర్వాత కోజికోడ్ నుంచి వేరే విమానంలో అదనపు పైలట్‌ను పంపి, ఆయనతో విమానాన్ని మళ్లీ నడిపించారు. ఇక జెట్ ఎయిర్‌వేస్ విమానాన్ని తాగి నడిపిన పైలట్‌ను ఉద్యోగం నుంచి తొలగించారు.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







