దుబాయ్‌లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- July 02, 2026
దుబాయ్: దుబాయ్‌లో డ్రగ్స్ స్మగ్లింగ్, పంపిణీకి పాల్పడుతున్న నలుగురు సభ్యుల ముఠాను అధికారులు అరెస్ట్ చేసి, దాదాపు 2 లక్షల ప్రెగాబాలిన్ (Pregabalin) మత్తు మాత్రలను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని దుబాయ్ అధికారులు గురువారం వెల్లడించారు.
దుబాయ్ కస్టమ్స్, దుబాయ్ పోలీస్ జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ యాంటీ-నార్కోటిక్స్ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ఈ విజయాన్ని సాధించారు. ఆసియా దేశం నుంచి వచ్చిన అనుమానాస్పద సరుకును దుబాయ్ కస్టమ్స్‌కు చెందిన డేటా విశ్లేషణ వ్యవస్థ గుర్తించింది. కృత్రిమ మేధ (AI), స్మార్ట్ రిస్క్ ఇంజిన్, ఆధునిక టార్గెటింగ్ టెక్నాలజీలు, కస్టమ్స్ ఇంటెలిజెన్స్ ఆధారంగా సరుకును గుర్తించిన అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేసి 1,50,600 ప్రెగాబాలిన్ మాత్రలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ సమాచారాన్ని దుబాయ్ పోలీసుల యాంటీ-నార్కోటిక్స్ విభాగంతో పంచుకోవడంతో నలుగురు సభ్యుల నేర ముఠాను అరెస్ట్ చేశారు. వారి వద్ద మరో 1,28,250 ప్రెగాబాలిన్ మాత్రలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో మొత్తం 2,78,850 మత్తు మాత్రలు, దాదాపు 200 కిలోగ్రాముల నిషేధిత పదార్థం స్వాధీనం అయినట్లు అధికారులు తెలిపారు.
దుబాయ్ కస్టమ్స్ ఇంటెలిజెన్స్ విభాగం డైరెక్టర్ రషీద్ బిన్ హర్బ్ అల్ షంసీ మాట్లాడుతూ, కృత్రిమ మేధ, డేటా అనలిటిక్స్, స్మార్ట్ రిస్క్ ఇంజిన్, అధునాతన ఇంటెలిజెన్స్ వ్యవస్థల వినియోగంతో అధిక ప్రమాదం ఉన్న సరుకులను ముందుగానే గుర్తించి అక్రమ రవాణాను సమర్థవంతంగా అడ్డుకుంటున్నామని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల సంఖ్య 73 శాతం తగ్గింది..!!
- ఖతార్‌లో జాతీయ ఫ్లూ టీకా క్యాంపెయిన్.. ఉచితంగా వ్యాక్సిన్..!!
- బహ్రెయిన్‌లో వెటర్నరీ నమూనాల ఎగుమతి సులభతరం..!!
- యూఏఈలో షాపింగ్ పై ఇంధన ధరల ప్రభావం..!!
- కువైట్‌లో 8 కార్మిక చట్ట ఉల్లంఘనలపై ఫిర్యాదు.. ఇక ఆన్లైన్లోనే..!!
- జెడ్డా ఎయిర్పోర్ట్ టెర్మినల్ 4లో పాస్‌పోర్ట్ కౌంటర్ల తనిఖీలు..!!
- దుబాయ్ రాయల్ ఫామిలీకు సిరిసిల్ల చేనేత కళాకారుడి అరుదైన కానుక
- ఖతార్‌లో ఇంపౌండ్ వాహనాల ఆన్లైన్ వేలం..!!
- గల్ఫ్ దేశాల భద్రతపై జీసీసీ పోలీస్ చీఫ్‌ల కీలక సమావేశం..!!
- దుబాయ్ ట్యాక్సీ డ్రైవర్ నిజాయితీ.. యూఏఈకి మకాం మార్చిన భారతీయ వ్యాపారి..!!







