షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట

- July 02, 2026 , by Maagulf
షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట

షార్జా: షార్జా లో ఆర్థిక కార్యకలాపాలకు ప్రోత్సాహం అందించేందుకు షార్జా సివిల్ డిఫెన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. సివిల్ డిఫెన్స్ నిబంధనల ఉల్లంఘనలకు విధించిన జరిమానాలపై 50 శాతం రాయితీ ప్రకటించింది.

ఈ రాయితీతో పాటు అగ్నిమాపక సేవల ఖర్చులపై కూడా 50 శాతం తగ్గింపు వర్తించనుంది. 2019 నుంచి 2026 వరకు నమోదైన ఉల్లంఘనలకు సంబంధించిన జరిమానాలపై ఈ ఆర్థిక రాయితీలు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక సదుపాయం 2026 జూన్ 16 నుంచి మూడు నెలల పాటు అందుబాటులో ఉంటుంది.

మరిన్ని వివరాల కోసం ప్రజలు అధికారిక కమ్యూనికేషన్ ఛానళ్లను ఉపయోగించాలని లేదా 06 516 3333 నంబర్‌ను సంప్రదించాలని షార్జా సివిల్ డిఫెన్స్ సూచించింది.

ఇదిలా ఉండగా, షార్జా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నిర్ణయానికి అనుగుణంగా ఇటీవల షార్జా పోలీసులు కూడా వ్యాపార సంస్థలకు ప్రోత్సాహకాలు, ఫీజుల తగ్గింపులను ప్రకటించారు. ఇందులో వాణిజ్య కార్యకలాపాలకు సంబంధించిన భద్రతా అనుమతుల (సెక్యూరిటీ పర్మిట్) పునరుద్ధరణ ఫీజులపై 50 శాతం రాయితీ, ఉల్లంఘనల జరిమానాలపై 50 శాతం తగ్గింపు, భద్రతా వ్యవస్థల సబ్‌స్క్రిప్షన్ ఫీజులపై 50 శాతం తగ్గింపు ఉన్నాయి.

అదనంగా, వ్యాపార సంస్థలకు తప్పనిసరి శిక్షణ కార్యక్రమాల ఫీజులపై 20 శాతం రాయితీ కూడా కల్పించారు. ఈ చర్యలు షార్జాలో వ్యాపార అనుకూల వాతావరణాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు ఆర్థికాభివృద్ధికి ఊతమిస్తాయని అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com