దుబాయ్‌లో ట్యాక్సీ డ్రైవర్లకు భారీ ఉద్యోగావకాశం
- July 03, 2026
విజయవాడ: విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునే ఆంధ్రప్రదేశ్ యువతకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSSDC) శుభవార్త అందించింది. దుబాయ్ (యూఏఈ)లో ట్యాక్సీ డ్రైవర్ల నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
ఈ నియామక ప్రక్రియలో ఎంపికైన అభ్యర్థులకు నెలకు AED 4,000 నుంచి AED 5,000 వరకు వేతనం అందించనున్నట్లు వెల్లడించింది. అభ్యర్థులు 25 నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు గల పురుషులు అయి ఉండాలి. కనీసం 10వ తరగతి (SSC) ఉత్తీర్ణత సాధించి ఉండటంతో పాటు చెల్లుబాటు అయ్యే భారతీయ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
యూఏఈ డ్రైవింగ్ లైసెన్స్ పొందే వరకు వసతి సౌకర్యాన్ని సంస్థ కల్పిస్తుంది. అలాగే వీసా, విమాన ప్రయాణ ఖర్చులను కూడా యజమాని సంస్థే భరిస్తుంది.
ఈ నియామకాలకు సంబంధించిన ఇంటర్వ్యూలు జూలై 7, 2026న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విజయవాడలోని ఓఎంసీఏపీ లిమిటెడ్ కార్యాలయం, ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలో నిర్వహించనున్నారు.
ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు బయోడేటా/రెజ్యూమ్, పాస్‌పోర్ట్ ప్రతులు, పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు, విద్యార్హత ధ్రువపత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా తీసుకురావాలని అధికారులు సూచించారు.
ఆసక్తి గల అభ్యర్థులు https://naipunyam.ap.gov.in/వెబ్‌సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం 9988853335, 8712655686, 8790118349, 8790117279 నంబర్లను సంప్రదించాలని ఏపీఎస్‌ఎస్‌డీసీ తెలిపింది.

తాజా వార్తలు
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!
- డమాస్కస్ కేఫ్ బాంబు దాడిని ఖండించిన ఒమన్..!!
- ఖతార్ అంతటా కస్టమర్ సాటిస్పెక్షన్ సర్వే 2026..!!
- జూన్ నెలలో 911 నెంబర్ కు 26 లక్షల కాల్స్..!!
- యూఏఈలో చిల్డ్రన్ మీడియా కంటెంట్ కోసం కొత్త ప్రమాణాలు..!!
- సింగిల్ స్క్రీన్ థియేటర్లకు ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రోత్సాహకాలు
- జర్మనీలో ఉద్యోగాలకు ఏపీఎస్‌ఎస్‌డీసీ అవకాశం..
- ముగిసిన తెలంగాణ ‘ఈ కేబినెట్’ భేటీ.. మూసీ ప్రాజెక్టు ఫేజ్-1కు ఆమోదం
- దుబాయ్‌లో ట్యాక్సీ డ్రైవర్లకు భారీ ఉద్యోగావకాశం







