మా టీవీకి షాక్.!
- August 12, 2016
ప్రముఖ తెలుగు ఎంటర్ టైన్మెంట్ ఛానల్ మాటీవీ నెట్‌వర్క్ కు కేంద్రం ఝలక్ ఇచ్చింది. మా టీవీ, మాగోల్డ్, మా మూవీస్, మా మ్యూజిక్ చానళ్లకు లైసెన్స్‌లను రద్దు చేసింది. తాజాగా రెన్యువల్ చేసిన లైసెన్స్‌ల జాబితా నుంచి మా టీవీ నెట్ వర్క్ కు చెందిన ఈ నాలుగు చానెల్స్‌ను కేంద్రం తొలగించింది.
మా సంస్థ డైరెక్టర్‌పై ఉన్న ఆర్థిక నేరాల అభియోగాల కారణంతో క్లియరెన్స్‌ను హోంశాఖ సెక్యూరిటీ నిరాకరించింది. ప్రసారమంత్రిత్వ శాఖ అప్ లింకింగ్, డౌన్ లింకింగ్ నిబంధనలకు అనుగుణంగా కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే, ఇప్పటికే మా టీవీ చానెల్స్‌ను స్టార్‌గ్రూప్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే, డైరెక్టర్లు మాత్రం పాతవాళ్లే కొనసాగుతున్నారు. దీంతో లైసెన్స్‌లను తమ పేరిట మార్చుకునేందుకు స్టార్‌గ్రూప్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.
గత కొంత కాలంగా నిబంధనలు ఉల్లంఘించి ప్రసారాలను కొనసాగిస్తున్న 73 టీవీ చానళ్లు సహా 24 ఎఫ్ఎం ఛానళ్లు, 9 పత్రికలపై నిషేధం విధిస్తున్నట్టు సమాచార, ప్రసారాల శాఖ తెలిపింది. అప్ లింకింగ్ గైడ్ లైన్స్ పాటించనందుకు ఇంతవరకూ 73 ఛానళ్ల అనుమతులు రద్దు చేసినట్టు రాజ్యసభకు ఐఅండ్ బీ(ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్) శాఖ సహాయమంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ వెల్లడించారు.
తాజా వార్తలు
- తిరుమల: శోభాయమానంగా పుష్పపల్లకీ సేవ
- సీఎం చంద్రబాబుకు నివేదిక సమర్పించిన టాస్క్ ఫోర్స్
- జూలై 21 నుంచి పార్లమెంట్ వర్షాకాలపు సమావేశాలు
- ఐసిసి ర్యాంకింగ్ లో 'కింగ్' విరాట్ కోహ్లినే!!
- సిరియా సైనిక ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడి
- కేంద్ర మంత్రి పాటిల్ సమక్షంలో చంద్రబాబు, రేవంత్ భేటి
- శ్రీవాణి టికెట్ల కేంద్రంలో సౌకర్యాలు కల్పించండి: టీటీడీ ఈవో శ్యామలరావు
- సలాలా అగ్రిటూరిజం ప్రాజెక్టులో గణనీయమైన పురోగతి..!!
- అబుదాబిలో 12 ప్రైవేట్ స్కూల్స్ పై నిషేధం..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్.. మిర్దిఫ్‌లో ట్రాఫిక్ డైవెర్షన్స్ అమలు..!!