అరెస్టయిన భారతీయుడికి ఇండియన్ ఎంబసీ సాయం
- August 12, 2016
అబుదాబీలోని ఇండియన్ ఎంబసీ, ఫోర్జరీ కేసులో అరెస్టయిన భారతీయుడి కేసులో అతనికి సహాయ పడేందుకు ముందుకొచ్చింది. ఈ విషయాన్ని బాధితుడి కుటుంబ సభ్యులు వెల్లడించారు. భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, ఈ విషయంలో తమకు తగిన సహాయాన్ని అందించేందుకు ముందుకొచ్చినట్లు బాధితుడి 16 ఏళ్ళ కుమార్తె సోషల్ మీడియా ద్వారా తెలిపారు. అబుదాబీలోని గల్ఫ్ బేస్డ్ బ్యాంక్‌లో తన తండ్రి పనిచేస్తున్నారని ఆమె వివరించింది. ఫోర్జరీ కేసులో జులై 19న ఆయన అరెస్టయ్యారు. ఉచితంగా లీగల్ కౌన్సిలింగ్‌ని లీగల్ కౌన్సెలర్స్ ద్వారా ఇవ్వగలుగుతామని ఎంబసీ అధికారులు ఆ కుటుంబానికి సమాచారమిచ్చారు. యూఏఈ అథారిటీస్‌తో ఈ విషయమై చర్చించినట్లు కౌన్సెలర్ దినేష్ కుమార్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఆ బాలిక, తన తల్లి గృహిణి అనీ ఇటీవలే జైల్లో తన తండ్రిని కలిసి వచ్చారని చెప్పింది.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్‌లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







