ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్‌కు? సమ్మర్ బ్రేక్‌కు ముందే క్లారిటీ..!!
- July 06, 2026
మనామా: ఫార్ములా-1 (ఎఫ్1) ఈ ఏడాది రద్దైన మిడిలీస్టు రేసుల్లో ఒకదాన్ని తిరిగి నిర్వహించే అంశంపై సమ్మర్ బ్రేక్‌కు ముందే తుది నిర్ణయం తీసుకోనుంది. ఈ విషయాన్ని ఎఫ్1 సీఈఓ స్టెఫానో డొమెనికాలి వెల్లడించారు. భద్రతా పరిస్థితులు అనుకూలిస్తే బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్‌ను తిరిగి క్యాలెండర్లో చేర్చే అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ ఏడాది మార్చిలో ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సైనిక దాడుల నేపథ్యంలో భద్రతా కారణాల వల్ల బహ్రెయిన్, సౌదీ అరేబియా గ్రాండ్ ప్రిక్స్లను ఎఫ్1 రద్దు చేసింది. అనంతరం ప్రాంతంలో ఉద్రిక్తతలు కొనసాగడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
అయితే, ప్రస్తుతం కాల్పుల విరమణ అమల్లోకి రావడం, వివాద పరిష్కారానికి 60 రోజుల గడువుతో అవగాహన ఒప్పందం కుదరడంతో పరిస్థితులు మెరుగుపడతాయని ఎఫ్1 యాజమాన్యం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. అన్నింటికంటే భద్రతే ముఖ్యమైనదని, పరిస్థితులు పూర్తిగా అనుకూలిస్తే బహ్రెయిన్ వెళ్లాలని ఆశిస్తున్నామని డొమెనికాలి తెలిపారు. ప్రస్తుతం సెప్టెంబర్‌లో జరిగే అజర్బైజాన్ గ్రాండ్ ప్రిక్స్, సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్ మధ్య ఉన్న ఒక వారం విరామాన్ని బహ్రెయిన్ రేసుకు అనువైన సమయంగా ఎఫ్1 పరిశీలిస్తోంది. అయితే రేసును నిర్వహించాలంటే టీమ్స్ ప్రయాణాలు, పరికరాల రవాణా, ఇతర లాజిస్టిక్స్ ఏర్పాట్ల కోసం ముందుగానే నిర్ణయం అవసరమని, అందుకే ఆగస్టు సమ్మర్ బ్రేక్‌కు ముందే స్పష్టత ఇవ్వాలని యాజమాన్యం భావిస్తోంది.
మరోవైపు, సీజన్ చివర్లో జరిగే ఖతర్, అబుదాబి గ్రాండ్ ప్రిక్స్లపై ఏవైనా భద్రతా సమస్యలు తలెత్తితే ప్రత్యామ్నాయంగా పోర్చుగల్‌లోని పోర్టిమావో సర్క్యూట్‌ను సిద్ధంగా ఉంచినట్లు ఎఫ్1 వెల్లడించింది. అవసరమైతే ఆ వేదికను వినియోగించాలా లేదా అనే అంశంపై సెప్టెంబర్ మధ్యలో నిర్ణయం తీసుకోనున్నారు. కాగా, పోర్టిమావో సర్క్యూట్ 2027లో అధికారికంగా మళ్లీ ఎఫ్1 క్యాలెండర్‌లోకి రానుంది.
తాజా వార్తలు
- భారత్–అమెరికా వాణిజ్య చర్చలపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు
- స్థానిక ఎన్నికలు.. జగన్ కీలక నిర్ణయం, అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్!
- అబుధాబిలో నవంబర్ 28 నుంచి మదర్ ఆఫ్ ది నేషన్ ఫెస్టివల్..
- ఘోర పడవ ప్రమాదం..14 మంది మృతి..
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్‌లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!







