కువైట్‌లో రెండో విడత పరీక్షల షెడ్యూల్ విడుదల..!!

- July 06, 2026 , by Maagulf
కువైట్‌లో రెండో విడత పరీక్షల షెడ్యూల్ విడుదల..!!

కువైట్ : కువైట్ విద్యాశాఖ 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన రెండో విడత (సెకండ్ రౌండ్) పరీక్షల షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించింది. 10, 11, 12వ తరగతుల విద్యార్థులకు సైన్స్, ఆర్ట్స్, మత విద్య (రిలిజియస్ ఎడ్యుకేషన్) విభాగాల వారీగా పరీక్షల తేదీలను ఖరారు చేసింది. 10వ మరియు 11వ తరగతి విద్యార్థుల రెండో విడత పరీక్షలు వచ్చే ఆదివారం ప్రారంభమై జూలై 22 వరకు కొనసాగనున్నాయి. 12వ తరగతి సైన్స్ విభాగం విద్యార్థులకు రెండో విడత పరీక్షలు వచ్చే గురువారం ప్రారంభమై జూలై 21 వరకు జరుగుతాయి. అదే రోజు ఆర్ట్స్ విభాగం పరీక్షలు కూడా ప్రారంభమై, జూలై 22న ముగియనున్నాయి. ఇక మత విద్య (రిలిజియస్ ఎడ్యుకేషన్) విభాగానికి చెందిన 12వ తరగతి విద్యార్థుల పరీక్షలు వచ్చే బుధవారం ప్రారంభమై జూలై 22 వరకు కొనసాగుతాయని విద్యాశాఖ వెల్లడించింది.

పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా నిర్వహించేందుకు, విద్యార్థులకు అనుకూల వాతావరణం కల్పించేందుకు ఈ షెడ్యూల్‌ను రూపొందించినట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు షెడ్యూల్‌ను పరిశీలించాలని, పరీక్షల తేదీలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.  ఇదిలా ఉండగా, అబ్దుల్లా అల్-సలెమ్ విశ్వవిద్యాలయం 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన మాస్టర్స్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం పొందిన విద్యార్థుల జాబితాను విడుదల చేసింది. ప్రవేశం పొందిన అభ్యర్థులు తమ ఈ-మెయిల్ ను పరిశీలించి, నిర్దేశిత గడువులోపు అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేయాలని యూనివర్సిటీ సూచించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com