గంటకు 200 కి.మీ.కు పైగా వేగం.. ఇద్దరు డ్రైవర్లపై కేసులు..!!

- July 06, 2026 , by Maagulf
గంటకు 200 కి.మీ.కు పైగా వేగం.. ఇద్దరు డ్రైవర్లపై కేసులు..!!

మస్కట్: ఒమాన్‌లోని సుల్తాన్ సయీద్ బిన్ తైమూర్ స్ట్రీట్ ‌లో గంటకు 200 కిలోమీటర్లకు పైగా వేగంతో వాహనాలు నడిపిన ఇద్దరు డ్రైవర్లను ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. వీరు ధోఫార్ గవర్నరేట్ వైపు ప్రయాణిస్తుండగా ఈ ఉల్లంఘనలను గుర్తించినట్లు ట్రాఫిక్ విభాగం తెలిపింది. మొబైల్ స్పీడ్ మానిటరింగ్ పరికరాల ద్వారా ఈ వాహనాల వేగాన్ని అధికారులు గుర్తించారు. అనంతరం ఇద్దరు డ్రైవర్లను  అదుపులోకి తీసుకున్నారు. ట్రాఫిక్ చట్టాలు, నిబంధనల ప్రకారం చర్యలు ప్రారంభించినట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా జనరల్ ట్రాఫిక్ డైరెక్టరేట్ వాహనదారులకు మరోసారి హెచ్చరిక జారీ చేసింది. నిర్ణయించిన వేగ పరిమితులను తప్పనిసరిగా పాటించాలని, అధిక వేగంతో వాహనాలు నడపడం వల్ల తమతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదం ఏర్పడుతుందని పేర్కొంది. రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాల్లో అతివేగం ఒకటని గుర్తుచేసింది. అందరూ బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని, ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ వేగ పరిమితుల్లో ప్రయాణించాలని అధికారులు సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com