300 మందికి పౌరసత్వం ఇచ్చిన అమిర్ షేక్
- August 12, 2016
అమిర్ షేక్ సబా అల్ అహ్మద్ అల్ బెర్ అల్ సబా, 300 మందికి సిటిజన్‌షిప్‌ని మంజూరు చేశారు. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఈ వివరాల్ని వెల్లడించింది. కువైటీ విడోలు, డైవోర్సీలకు చెందిన 180 మంది పిల్లలకు, మరో 120 మందికి ఈ పౌరసత్వం అందించినట్లు మినిస్ట్రీ వర్గాలు పేర్కొన్నాయి. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సిటిజన్‌షిప్ (జిడిసి)ని సందర్శించిన అమిర్ షేక్, ముఖ్యమైన విషయాల్లో సీక్రెసీ తప్పనిసరి అనీ, స్పెషల్ నీడ్స్ కేసుల్లో మానవత్వంతో వ్యవహరించాలని ఆయన సూచించారు. సాద్ అల్ అబ్దుల్లా అకాడమీ ఫర్ సెక్యూరిటీ సైన్సెస్ని ఈ సందర్భంగా పరిశీలించారు మినిస్టర్ షేక్ మొహమ్మద్. అకాడమీ నుంచి రానున్న రోజుల్లో స్పెషలైజ్డ్ స్టడీస్ కోసం విదేశాలకు పంపే ఏర్పాట్లు చేయాలనీ, కోస్ట్ గార్డ్స్, పోలీస్ ఎయిర్‌ఫోర్స్ విభాగాల్లో ఉపయోగపడే విధంగా వారికి శిక్షణ ఇప్పించాల్సి ఉందని మినిస్టర్ షేక్ మొహమ్మద్ అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్‌జెట్‌లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్‌లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









