కువైట్‌లో 50 డిగ్రీలకు చేరనున్న ఉష్ణోగ్రతలు
- August 12, 2016
ఈ వారాంతంలో కువైట్‌లో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు ఆ పైన చేరుకునే అవకాశం ఉన్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) అధికారి అబ్దుల్ అజీజ్ అల్ కరావి చెప్పారు. అత్యధిక ఉష్ణోగ్రతలు 48 నుంచి 51 డిగ్రీల సెల్సియస్ ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అత్యల్ప ఉష్ణోగ్రతలు 33 నుంచి 36 డిగ్రీల సెల్సియస్ మధ్యన ఉంటాయి. మెరైన్ వెదర్ అంచనా ప్రకారం సముద్రపు అలల యెత్తు 1 నుంచి 4 మీటర్ల ఎత్తులో ఉంటాయి. శుక్రవారం బాగా వేడిగా ఉంటుందనీ, గంటకు 10 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో వేడి గాలులు వీస్తాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. రేపు కూడా వేడి ఉష్ణోగ్రత కొనసాగుతుంది. కొన్ని చోట్ల 49 నుంచి 53 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- క్రైస్తవ సమస్యలు పరిష్కరిస్తా: మంత్రి అజారుద్దీన్
- తెలంగాణ రాష్ట్రంలో కొద్దిగా తగ్గిన చలితీవ్రత
- దుర్గమ్మ నినాదాలతో మార్మోగుతున్న బెజవాడ
- ఇక అన్ని ఆలయాల్లో యుపిఐ చెల్లింపులు
- ఇన్స్టాగ్రామ్ లో కొత్త ఫీచర్
- NATS సాయంతో ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మక మార్పులు
- బహ్రెయిన్ గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఇండియన్ స్కూల్..!!
- కింగ్ అబ్దులాజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం కొత్త రికార్డు..!!
- 30వేలకు పైగా ట్రాఫిక్ లేన్ చట్ట ఉల్లంఘనలు నమోదు..!!
- మెడికల్ సిటీ ఆధ్వర్యంలో దివ్యాంగుల దినోత్సవం..!!







