ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- August 25, 2026
హైదరాబాద్: ఇటీవల జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో మహిళల డబుల్స్ విభాగంలో కాంస్య పతకం సాధించి భారత్‌కు గర్వకారణంగా నిలిచిన బ్యాడ్మింటన్ ఛాంపియన్లు గాయత్రి గోపిచంద్, త్రిసా జాలీ(Gayatri Gopichand- Treesa Jolly) ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో జరిగిన ఈ సమావేశానికి జాతీయ ప్రధాన కోచ్ పుల్లెల గోపిచంద్ ఆధ్వర్యంలో క్రీడాకారులు వెళ్లగా, ముఖ్యమంత్రి వారికి ఘనంగా స్వాగతం పలికారు.
అంతర్జాతీయ స్థాయిలో దేశ కీర్తి ప్రతిష్టలను పెంచిన ఈ ఇద్దరు యంగ్ షట్లర్లను సీఎం రేవంత్ రెడ్డి శాలువాతో సన్మానించి ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో జరిగే ప్రతిష్టాత్మక పోటీలలో మరింతగా రాణించి మరిన్ని బంగారు పతకాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, మాజీ ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి.వి లక్ష్మి పాల్గొని క్రీడాకారులకు తమ శుభాకాంక్షలు తెలియజేశారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







