దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- August 25, 2026
దుబాయ్: నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు గౌరవ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలను ఇండియన్ పీపుల్స్ ఫోరం (IPF) తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ ఆధ్వర్యంలో దుబాయ్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, అనంతరం కార్మికులకు పండ్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా IPF తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ అధ్యక్షుడు శరత్ గౌడ్ మాట్లాడుతూ.. ఎంపీ ధర్మపురి అర్వింద్ గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా హెల్ప్ సెంటర్ ఏర్పాటు చేసి, 24 గంటలూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని తెలిపారు. గల్ఫ్ కార్మికుల కష్టాలను తీర్చేందుకు నిరంతరం పనిచేస్తూ వారికి ఆత్మబంధువుగా నిలుస్తున్నారని కొనియాడారు.
గల్ఫ్ కార్మికుల చిరకాల కోరికగా ఉన్న నిజామాబాద్ విమానాశ్రయం ఏర్పాటుకు కూడా ఎంపీ అర్వింద్ కృషి చేస్తారన్న ఆశాభావాన్ని శరత్ గౌడ్ వ్యక్తం చేశారు. ఆదిలాబాద్, వరంగల్‌తో పాటు నిజామాబాద్‌లో విమానాశ్రయం ఏర్పాటైతే గల్ఫ్ ప్రాంతాల్లో నివసిస్తున్న తెలంగాణ ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో IPF సెంట్రల్ జాయింట్ సెక్రటరీ కుంబల మహేందర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు మదన్, తెలంగాణ సెక్రటరీ మేగీ కృష్ణ, సీనియర్ నాయకులు గాజా నవనీత్, పెనుకుల అశోక్, జనగాం బాలకిషన్, యోగేష్, రమేష్ పిట్లా, లక్ష్మణ్, ఆర్మూరి వినోద్ తదితరులు పాల్గొన్నారు.
అలాగే IPF సభ్యులు శీలం సాయిరాజ్, శేఖర్, మోహన్ రెడ్డి, ప్రసాద్ తదితరులు కార్యక్రమంలో పాల్గొని ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!







