బహ్రెయిన్ బీచ్‌లో తెలంగాణ వాసి మృతి
- July 06, 2026
మనామా: బహ్రెయిన్‌లో తెలంగాణ వాసి మృతి చెందడం స్థానికంగా విషాదం నింపింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన తోట శ్రీనివాస్ పని నిమిత్తం బహ్రెయిన్ వెళ్లారు. దుర్రత్ అల్ బహ్రెయిన్ సముద్ర తీరంలో గడుపుతున్న సమయంలో శ్రీనివాస్ ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న కోస్ట్ గార్డ్ బృందాలు వెంటనే రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే అప్పటికే శ్రీనివాస్ ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు నిర్ధారించారు.
ఏడేళ్లుగా బహ్రెయిన్‌లోనే పని
శ్రీనివాస్ ఉపాధి కోసం బహ్రెయిన్ వెళ్ళి చాలా కాలం అయ్యింది. అక్కడ ఉన్న మహమ్మద్ అహ్మద్ కో (MAC) సంస్థలో 2019 నుంచి పని చేస్తున్నారు. కుటుంబ పోషణ కోసం విదేశాలకు వెళ్లిన శ్రీనివాస్ ఇలా అకాల మరణం చెందడం కుటుంబ సభ్యులను శోకసంద్రంలో ముంచింది. తన స్వస్థలానికి పంపాలని కుటుంబ సభ్యులు ప్రభుత్వం కోరుతున్నారు. శ్రీనివాస్ మరణ వార్త తెలియగానే నిజామాబాద్ జిల్లాలోని ఆయన స్వగ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
సహాయక చర్యలు, మృతదేహ తరలింపు
ప్రమాదం జరిగిన వెంటనే కోస్ట్ గార్డ్ బృందాలు మృతదేహాన్ని వెలికితీశారు. ఘటనపై బహ్రెయిన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అక్కడి భారత రాయబార కార్యాలయ అధికారులు మృతుడి కుటుంబ సభ్యులకు పూర్తి సమాచారం అందించారు. మృతదేహాన్ని త్వరగా స్వదేశానికి తరలించేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రవాస భారతీయులు శ్రీనివాస్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.
తాజా వార్తలు
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత
- ప్రయాణికులకు వీసీ సజ్జనార్ కీలక సూచన..
- భారత్–అమెరికా వాణిజ్య చర్చలపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు
- స్థానిక ఎన్నికలు.. జగన్ కీలక నిర్ణయం, అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్!
- అబుధాబిలో నవంబర్ 28 నుంచి మదర్ ఆఫ్ ది నేషన్ ఫెస్టివల్..
- ఘోర పడవ ప్రమాదం..14 మంది మృతి..







