రోడ్డుపై వదిలివేయబడ్డ చిన్నారి
- August 12, 2016
ఓ చిన్నారిని రోడ్డుపై గుర్తు తెలియని వ్యక్తులు వదిలేసినట్లు షార్జా పోలీసు అధికారి ఒకరు చెప్పారు. ఆ బేబీ బాయ్‌ని పోలీసులు గుర్తించి, సంరక్షించారు. ఆ బాలుడి వయసు కొన్ని రోజులు మాత్రమే ఉంటుందని పోలీసులు అంటున్నారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నప్పటికీ, వైద్య చికిత్స అవసరమవడంతో ఆ బాలుడ్ని ఆసుపత్రికి తరలించారు. బాలుడి తల్లిదండ్రుల్ని ట్రాక్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. సర్జరీ ద్వారా ఆ బాలుడ్ని రక్షించవచ్చని వైద్యులు తెలిపారు. బాలుడికి ఉన్న ఆరోగ్య సమస్యను, ఆమె తల్లి కడుపులో ఉండగానే గుర్తించవచ్చనీ, అప్పుడే సరిచేయవచ్చనీ సరైన అవగాహన లేక, బాలుడు జన్మించిన తర్వాత అతని ఆరోగ్య పరిస్థితిని చూసి వదిలించుకోవాలని తల్లిదండ్రులు భావించి ఉండొచ్చని వైద్యులు అనుమానం వ్యక్తం చేశారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి కుదుటపడ్డాక అతన్ని చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీకి అప్పగిస్తారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్‌లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









