బహ్రెయిన్‌లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- July 07, 2026
మనామా: బహ్రెయిన్ న్యాయ, ఇస్లామిక్ వ్యవహారాలు, వక్ఫ్ మంత్రిత్వ శాఖ (Ministry of Justice, Islamic Affairs and Waqf) బెనిఫిట్ కంపెనీ (Benefit Company) భాగస్వామ్యంతో ఎన్‌ఫోర్స్ మెంట్ క్లెయిమ్‌లు, మెయింటెనెన్స్ చెల్లింపుల కోసం కొత్త ఎలక్ట్రానిక్ పేమెంట్ సేవను ప్రారంభించింది. ఈ కొత్త వ్యవస్థ ద్వారా ఎన్‌ఫోర్స్‌మెంట్ కేసులకు సంబంధించిన చెల్లింపులు ఇకపై రియల్ టైమ్‌లో పూర్తికానున్నాయి. అలాగే అవసరమైన డాక్యుమెంట్స్ సంఖ్యను 50 శాతం తగ్గించనుంది.
సివిల్, షరియా అమలు తీర్పులకు అనుగుణంగా వ్యక్తులు, కంపెనీలు, ఇతర సంస్థలు ఈ యాప్ ద్వారా నేరుగా ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేయవచ్చని న్యాయ ఖాతాల విభాగం డైరెక్టర్ సబా తారిఖ్ అధ్బీ అల్ జలాహ్మా తెలిపారు. ఐబాన్ (IBAN) వివరాల ఆధారంగా పేమెంట్స్ లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్లో నేరుగా జమ అవుతాయని తెలిపారు. దీంతో పేమెంట్ ప్రక్రియ మరింత పారదర్శకంగా, వేగవంతంగా పూర్తవుతుందని పేర్కొన్నారు.
ప్రభుత్వ సేవలను వేగవంతంగా, సులభంగా మరింత సురక్షితంగా మార్చడంలో డిజిటల్ చెల్లింపు వ్యవస్థలు కీలక పాత్ర పోషిస్తుందని బెనిఫిట్ కంపెనీ పేమెంట్ సర్వీసెస్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ షఫక్ అల్ కూహెజీ తెలిపారు. ఈ కొత్త సేవ బహ్రెయిన్ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ లక్ష్యాలకు మరింత బలాన్ని చేకూర్చుతుందన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్‌లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్‌లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్‌లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్‌లో విదేశీ వర్సిటీలు
- కువైట్‌లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







