కువైట్లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- July 07, 2026
కువైట్ : కువైట్ లో కార్మికుల హక్కుల పరిరక్షణతో పాటు దేశ కార్మిక వ్యవస్థను మరింత బలోపేతం చేయనున్నారు. ఈ మేరకు కార్మిక హక్కులు, కార్మిక మార్కెట్ సంస్కరణలు, ప్రభుత్వ సంస్థల మధ్య సమన్వయాన్ని మరింత పెంపొందించే అంశాలపై విదేశాంగ మంత్రిత్వ శాఖ, పబ్లిక్ అథారిటీ ఫర్ మాన్పవర్ (PAM) సంయుక్తంగా చర్చించాయి.
ఉద్యోగ వాతావరణాన్ని మెరుగుపరచడంతో పాటు కార్మికులకు మరింత భద్రత కల్పించే చర్యలపై దృష్టి సారించినట్లు మానవ హక్కుల వ్యవహారాల సహాయ విదేశాంగ మంత్రి అంబాసడర్ షేకా జవాహర్ అల్-సబా తెలిపారు. కార్మికులు, యజమానుల హక్కులను కాపాడేలా కార్మిక చట్టాలు, విధానాలను మరింత బలోపేతం చేయడంపై చర్చించినట్లు వెల్లడించారు. కార్మికుల హక్కుల పరిరక్షణకు సంబంధించిన అంతర్జాతీయ ఒప్పందాలను అమలు చేయడంలో కువైట్ కట్టుబడి ఉందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
విదేశాంగ మంత్రిత్వ శాఖతో కలిసి కార్మికులను పంపే దేశాలతో ద్వైపాక్షిక అవగాహన ఒప్పందాలను (MoUs) మరింత బలోపేతం చేయడంతో పాటు అంతర్జాతీయ సంస్థలతో సహకారాన్ని విస్తరించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ మాన్పవర్ డైరెక్టర్ జనరల్ రబాబ్ అల్-ఒసైమీ తెలిపారు. ఈ చర్యలతో కార్మిక మార్కెట్పై పర్యవేక్షణ కూడా బలోపేతం అవుతుందన్నారు. కువైట్లో పారదర్శకమైన, సమర్థవంతమైన కార్మిక వ్యవస్థను అభివృద్ధి చేయడంలో ఈ చర్యలు మరో కీలక అడుగుగా నిలుస్తాయని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- BD30కే అద్దె కారు.. ప్రమాదంతో BD6,204 జరిమానా..!
- నిత్యావసర వస్తువులు, ఇంధన సరఫరాకు కువైట్ కీలక చర్యలు..!!
- అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, 15 ఏళ్ల కుమారుడు మృతి..!!
- దుబాయ్లో GTF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
- ఖతార్లో అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు ప్రోత్సాహం..!!
- ఒమన్లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!
- ఇరాన్ పై అతి పెద్ద బాంబు దాడికి అమెరికా ప్లాన్
- షార్జా పోలీసుల భారీ ఆపరేషన్.. సైబర్ నేరాలకు పాల్పడిన నాలుగు ముఠాల గుట్టురట్టు!
- ‘సౌదీ పై దాడులు వెంటనే ఆపాలి’ అంటూ హౌతీలకు భారత్ తీవ్ర హెచ్చరిక







