హమద్ టౌన్లో వీధి కుక్కల సమస్యపై చర్యలు ప్రారంభం..!!
- July 08, 2026
మనామా: ఉత్తర మున్సిపల్ కౌన్సిల్ ద్వారా పదేపదే ఫిర్యాదులు అందిన నేపథ్యంలో, మున్సిపాలిటీ వ్యవహారాలు మరియు వ్యవసాయ మంత్రిత్వ శాఖ.. హమద్ టౌన్‌లోని పురావస్తు సమాధుల వద్ద ఉన్న వీధి కుక్కలపై చర్యలను ప్రారంభించింది.
బ్లాక్ 1207లోని పురాతన స్మశానవాటికలలో.. ముఖ్యంగా నాలుగవ మరియు ఏడవ రౌండ్అబౌట్ల మధ్య కుక్కల సమస్య అధికంగా ఉందని నివాసితుల నుంచి ఫిర్యాదులు అందాయని ఉత్తర మున్సిపల్ కౌన్సిల్ సభ్యుడు అబ్దుల్లా ముబారక్ బిలాల్ అల్ ఖొబైసీ తెలిపారు. రాత్రి సమయంలో వీటి సమస్య అధికంగా ఉంటుందన్నారు.
మంత్రిత్వ శాఖ ఈ ఫిర్యాదును జంతు నియంత్రణ సంస్థకు రిఫర్ చేసిందని, ఆ సంస్థ ప్రభావిత ప్రాంతాలను సందర్శించి, వాటిని తొలగింపును ప్రారంభించిందని అధికారులు తెలిపారు. కుక్కలను పట్టుకోవడం, వాటికి సంతాన నిరోధక ఆపరేషన్లు చేయడం మరియు హఫీరాలో వాటికి తాత్కాలిక ఆశ్రయం కల్పించడం కోసం రాబోయే 30 నెలలపాటు నిర్వహించేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. అలాగే మైక్రోచిప్ ద్వారా పెంపుడు జంతువులను నమోదు చేయడానికి త్వరలోనే చట్టం రాబోతుందన్నారు.
అయితే, కుక్కలను శిక్షించడం కంటే ముందు అవగాహన కల్పించాలని బహ్రెయిన్ సొసైటీ ఫర్ క్యాట్స్ అండ్ డాగ్స్ వైస్-ఛైర్మన్ మహమ్మద్ అల్ మాస్ పిలుపునిచ్చారు. మరోవైపు, బహ్రెయిన్ ఇప్పటికీ రేబీస్ రహిత దేశంగానే ఉందని అధికారులు తెలిపారు. వీధి జంతువుల నిర్వహణపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్‌పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్‌పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్‌లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్‌లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!







