దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- July 08, 2026
దోహా: ఖతార్ రవాణా శాఖ (MOT) పర్యవేక్షణలో 'మోవాసలాట్-కర్వా' (Mowasalat-Karwa) సంస్థ ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్‌ను విజయవంతంగా నిర్వహించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా రోబో-టాక్సీలు రవాణా శాఖ ప్రధాన కార్యాలయం మరియు పాత దోహా పోర్ట్ (Old Doha Port) మధ్య రాకపోకలు సాగించాయి.
రవాణా శాఖ (MOT) రూపొందించిన 'అటానమస్ వెహికల్స్ స్ట్రాటజీ' ప్రణాళికలకు ఈ వినూత్న ప్రాజెక్ట్ అనుగుణంగా ఉందని రవాణా శాఖ ల్యాండ్ ట్రాన్స్పోర్ట్ వ్యవహారాల అసిస్టెంట్ అండర్ సెక్రటరీ అబ్దుల్లా సైఫ్ అల్-సులైతి పేర్కొన్నారు. అత్యాధునిక స్మార్ట్ మరియు పర్యావరణ అనుకూల వ్యవస్థలను ఉపయోగించి పబ్లిక్ ట్రాన్స్ పోర్టులో అధునాతన సాంకేతికతను అమలు చేయడం తమ లక్ష్యమన్నారు. అలాగే, స్మార్ట్ రవాణా పరిష్కారాలను అవలంబించడంలో ప్రపంచ స్థాయి ఉత్తమ విధానాలను రవాణా శాఖ అనుసరిస్తోందని ఆయన తెలిపారు. ఈ ట్రయల్ రన్లలో అత్యున్నత భద్రతా ప్రమాణాలు పాటించినట్టు, 'కర్వా'తో కలిసి రవాణా శాఖ తదుపరి కార్యాచరణ దశలను ప్రారంభించనుందని ఆయన చెప్పారు.
రవాణా మంత్రిత్వ శాఖ (MOT) భూ రవాణా లైసెన్సింగ్ విభాగం డైరెక్టర్ హమద్ అలీ అల్-మర్రి మాట్లాడుతూ.. ప్రజలకు నమ్మకమైన మరియు సురక్షితమైన సేవలను అందించడానికి, అలాగే అత్యుత్తమ ప్రమాణాలతో రవాణా సేవలను అందించడానికి మంత్రిత్వ శాఖ అత్యంత ప్రాధాన్యతనిస్తోందని తెలియజేశారు.
ప్రజా రవాణా రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మరియు 'ఖతార్ నేషనల్ విజన్ 2030' లక్ష్యాలకు అనుగుణంగా అత్యున్నత స్థాయి భద్రత మరియు సౌకర్యాలతో ప్రజలకు సేవలను అందించడమే తమ లక్ష్యమని మోవాసలాత్ (కర్వా) సీఈఓ అహ్మద్ హసన్ అల్-ఒబైద్లీ తెలిపారు.
ఈ ప్రాజెక్ట్ మొదటి దశ ఆగస్టు 2025లో ప్రారంభమైంది. ఆ తర్వాత గత డిసెంబర్లో 'కర్వా' యాప్ ద్వారా వాణిజ్యపరమైన పైలట్ సేవలు మొదలయ్యాయి. ఈ దశలో డ్రైవర్ సీటులో శిక్షణ పొందిన సేఫ్టీ ఆఫీసర్ (SO) పర్యవేక్షణలో అటానమస్ కలిగిన వాహనాలతో 2,500 ట్రిప్పులు నిర్వహించారు. ఈ పైలట్ దశలో మానవ జోక్యం లేకుండా నిర్వహించిన ప్రయోగాత్మక ప్రయాణాలు 94% విజయవంతమయ్యాయని ప్రకటించారు.
ఈ ప్రాజెక్ట్ యొక్క రెండవ దశలో గతంలో పరీక్షించి ఆమోదించబడిన మూడు మార్గాలలో ఓల్డ్ దోహా పోర్ట్ - ది గేట్ మాల్, సౌక్ వాకిఫ్ - షెరటన్ దోహా హోటల్ మరియు MIA - వెస్ట్ బే ఉన్నాయి. వాహనంలో భద్రతా అధికారి (SO) లేకుండానే రిమోట్ ఆపరేషన్ (RO) ద్వారా రెండు అటానమస్ గల రోబో-టాక్సీలను నడపడం జరుగుతుందన్నారు. ఈ రెండవ దశను ఒక్కో మార్గంలో విడివిడిగా మరియు దశలవారీగా అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. పూర్తిస్థాయిలో ట్రయల్స్ పూర్తయితే 'కర్వా' (Karwa) యాప్ ద్వారా ఈ సేవ ప్రజలకు అందుబాటులోకి తీసుకురాబడుతుందన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్‌పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్‌పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్‌లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్‌లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!







