కువైట్‌లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- July 08, 2026
కువైట్ :భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ మూడు రోజుల అధికారిక పర్యటన కోసం కువైట్‌కు చేరుకున్నారు. గల్ఫ్ దేశాలతో పాటు ఇతర కీలక భాగస్వామ్య దేశాలతో వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా చేపట్టిన ఆరు దేశాల పర్యటనలో భాగంగా ఆయన కువైట్‌ను సందర్శిస్తున్నారు. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జైశంకర్‌కు ఆ దేశ ఉప విదేశాంగ మంత్రి హమద్ సులైమాన్ మషాన్ అల్-మషాన్ ఘన స్వాగతం పలికారు.
జూలై 7 నుంచి 9 వరకు జరిగే ఈ పర్యటనలో జైశంకర్ కువైట్ నాయకత్వం, సీనియర్ ప్రభుత్వ ప్రతినిధులతో ఉన్నతస్థాయి సమావేశాలు నిర్వహించనున్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన భద్రత, సాంకేతికత, విద్య, కాన్సులర్ సేవలు తదితర కీలక రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత విస్తరించే అంశాలపై చర్చలు జరగనున్నాయి. అలాగే, కువైట్ విదేశాంగ మంత్రితో పాటు ఇతర ఉన్నతాధికారులతో సమావేశమై గల్ఫ్ ప్రాంతంలోని తాజా భౌగోళిక-రాజకీయ పరిణామాలు, ఉమ్మడి ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై అభిప్రాయాలు పంచుకోనున్నారు.
ఈ పర్యటన భారత్–కువైట్ మధ్య పెరుగుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యానికి నిదర్శనంగా నిలుస్తుందని అధికారులు తెలిపారు. ఆర్థిక, రాజకీయ, ప్రజల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు గల్ఫ్ దేశాలతో సహకారాన్ని విస్తరించాలన్న భారత ప్రభుత్వ సంకల్పాన్ని ఈ పర్యటన చాటుతోందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్‌పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్‌పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్‌లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్‌లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!







