సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!

- July 08, 2026 , by Maagulf
సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!

మస్కట్: ఒమన్‌లోని అల్ ధాహిరా గవర్నరేట్‌లో సోషల్ మీడియా ద్వారా ఓ పౌరుడు దోపిడీకి గురయ్యాడు. అతడిపై దాడి చేసి, దోపిడీకి పాల్పడిన తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు ముందుగా సోషల్ మీడియా వేదిక ద్వారా బాధితుడిని తమ వద్దకు రప్పించారని, అనంతరం అతనిపై దాడి చేసి, అతని వాహనంలో ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాలను దోచుకెళ్లారని పోలీసులు తెలిపారు.

అంతటితో వదిలేయకండా.. దోచుకున్న వస్తువులను తిరిగి ఇవ్వాలంటే వివిధ మొత్తాల్లో డబ్బు చెల్లించాలని బాధితుడిని బెదిరిస్తూ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డారు. ఫిర్యాదు అందుకున్న అల్ ధాహిరా గవర్నరేట్ పోలీస్ కమాండ్ దర్యాప్తు చేపట్టి తొమ్మిది మంది నిందితులను అదుపులోకి తీసుకుంది. వారిపై చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com