సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- July 08, 2026
మస్కట్: ఒమన్‌లోని అల్ ధాహిరా గవర్నరేట్‌లో సోషల్ మీడియా ద్వారా ఓ పౌరుడు దోపిడీకి గురయ్యాడు. అతడిపై దాడి చేసి, దోపిడీకి పాల్పడిన తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు ముందుగా సోషల్ మీడియా వేదిక ద్వారా బాధితుడిని తమ వద్దకు రప్పించారని, అనంతరం అతనిపై దాడి చేసి, అతని వాహనంలో ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాలను దోచుకెళ్లారని పోలీసులు తెలిపారు.
అంతటితో వదిలేయకండా.. దోచుకున్న వస్తువులను తిరిగి ఇవ్వాలంటే వివిధ మొత్తాల్లో డబ్బు చెల్లించాలని బాధితుడిని బెదిరిస్తూ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డారు. ఫిర్యాదు అందుకున్న అల్ ధాహిరా గవర్నరేట్ పోలీస్ కమాండ్ దర్యాప్తు చేపట్టి తొమ్మిది మంది నిందితులను అదుపులోకి తీసుకుంది. వారిపై చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్‌పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్‌పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్‌లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్‌లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!







