విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- July 09, 2026
రియాద్: సౌదీ అరేబియాలో ఆస్తులు కొనుగోలు చేసే విదేశీయులకు వర్తించే పన్ను నిబంధనలను జనరల్ రియల్ ఎస్టేట్ అథారిటీ (REGA) స్పష్టం చేసింది. దేశంలో జరిగే అన్ని స్థిరాస్తి లావాదేవీలపై సౌదీయులు, విదేశీయులు అనే తేడా లేకుండా 5 శాతం రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ తప్పనిసరిగా వర్తిస్తుందని వెల్లడించింది.
అయితే, రియాద్, జెడ్డా, మక్కా, మదీనా నగరాల్లో ప్రభుత్వం నిర్దేశించిన ప్రత్యేక భౌగోళిక ప్రాంతాల్లో విదేశీయులు ఆస్తులు కొనుగోలు చేస్తే, 5 శాతం ట్రాన్సాక్షన్ ట్యాక్స్‌తో పాటు అదనంగా 2 శాతం ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుందని రెగా అధికార ప్రతినిధి తైసీర్ అల్-ముఫర్రిజ్ తెలిపారు.
మక్కా, మదీనా నగరాల మతపరమైన, చారిత్రక ప్రాధాన్యాన్ని పరిరక్షించేందుకు అక్కడ ఆస్తుల యాజమాన్యాన్ని ముస్లింలకు మాత్రమే, అదీ ప్రభుత్వం నిర్దేశించిన ప్రాంతాల్లో, చట్టబద్ధమైన విధానాల ప్రకారమే అనుమతిస్తున్నట్లు రెగా వెల్లడించింది.
రియాద్, జెడ్డా దేశంలోని ప్రధాన ఆర్థిక, పట్టణ కేంద్రాలుగా ఉన్నందున, విదేశీయుల ఆస్తి కొనుగోళ్లను నిర్దిష్ట ప్రాంతాలకు పరిమితం చేయడం ద్వారా పట్టణాభివృద్ధి, జీవన నాణ్యత, రియల్ ఎస్టేట్ పెట్టుబడులు మరియు ఆస్తి మార్కెట్ దీర్ఘకాలిక స్థిరత్వాన్ని ప్రోత్సహించడమే లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్‌లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్‌కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్
- యూఏఈ నుంచి భారత్‌కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్‌లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన







