దుబాయ్‌లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు

- July 09, 2026 , by Maagulf
దుబాయ్‌లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు

దుబాయ్: దుబాయ్‌లో వైఎస్సార్సీపీ కుటుంబ సభ్యులు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిమానులు, వైఎస్సార్ శ్రేయోభిలాషులు కలిసి మాజీ ముఖ్యమంత్రి, దివంగత మహానేత డా. వై.ఎస్.రాజశేఖర రెడ్డి జయంతిని ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమం సుధాకర్ రెడ్డి పర్యవేక్షణలో, సోమిరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. యూఏఈ వైఎస్సార్సీపీ కన్వీనర్ సయ్యద్ అక్రమ్, జీసీసీ కో-కన్వీనర్ మహమ్మద్ జీలాన్ బాషా, గోదావరి రెస్టారెంట్ విద్యాసాగర్, పారిశ్రామికవేత్తలు శ్యామ్, సత్యం, కోటేశ్వర్ రెడ్డి, చక్రి, షేక్ అబ్దుల్లా, శ్రీనివాస్ చౌదరి, తెలుగు అసోసియేషన్‌కు చెందిన మసివుద్దీన్, దినేష్ తదితరుల సమన్వయంతో వేడుకలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి.

ఈ సందర్భంగా డా.వై.ఎస్.రాజశేఖర రెడ్డి ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను వక్తలు గుర్తు చేసుకున్నారు. ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం, 108 అంబులెన్స్ సేవలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, రైతు రుణమాఫీ, డ్వాక్రా వంటి పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపిన మహానేతగా ఆయనను కొనియాడారు.

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగించిన డా.వైఎస్సార్ సేవలు చిరస్మరణీయమని, ఆయన ఈరోజు మన మధ్య లేకపోవడం రాష్ట్రానికి తీరని లోటని పలువురు అభిప్రాయపడ్డారు. అయితే ఆయన ఆశయాలు, సంక్షేమ పాలన, ప్రజాసేవా స్పూర్తి నేటికీ లక్షలాది మందికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.

కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు, అభిమానులు డా.వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేయాలని సంకల్పం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా పాల్గొన్నవారు, “మహానేత వైఎస్సార్ ఆశయాలే మా మార్గం…ఆయన సేవలే మా స్ఫూర్తి” అని పేర్కొంటూ ఆయనకు ఘన నివాళులు అర్పించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com