ఖైతాన్–ఎయిర్‌పోర్ట్ రోడ్ జంక్షన్‌ తాత్కాలిక మూసివేత..!!

- July 10, 2026 , by Maagulf
ఖైతాన్–ఎయిర్‌పోర్ట్ రోడ్ జంక్షన్‌ తాత్కాలిక మూసివేత..!!

కువైట్ సిటీ: రోడ్డు నిర్వహణ పనుల నేపథ్యంలో ఖైతాన్‌లోని హబీబ్ మునవ్వర్ స్ట్రీట్–ఎయిర్‌పోర్ట్ రోడ్ జంక్షన్‌ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు కువైట్ జనరల్ ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది.

క్రౌన్ ప్లాజా హోటల్ ఎదురుగా ఉన్న ఈ జంక్షన్ ను జూలై 9 (గురువారం) నుంచి మూసివేస్తామని, నిర్వహణ పనులు పూర్తయ్యే వరకు అంటే జూలై 10 (శుక్రవారం)వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు.

ఈ నేపథ్యంలో ఖైతాన్ మరియు ఫర్వానియా ప్రాంతాల్లో ప్రయాణించే వాహనదారులు తమ ప్రయాణాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోవాలని ట్రాఫిక్ శాఖ సూచించింది. వీలైనంత వరకు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని, ట్రాఫిక్ సిగ్నల్స్ మరియు అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరింది. రోడ్డు మరమ్మతు పనులు త్వరగా పూర్తయ్యేలా ప్రజలు సహకరించాలని ట్రాఫిక్ అధికారులు కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com