ఫేక్ డిగ్రీతో టీచర్ ఉద్యోగం.. ప్రవాసికి 6 నెలల జైలుశిక్ష..!!
- July 11, 2026
దోహా: నకిలీ యూనివర్సిటీ డిగ్రీ సర్టిఫికేట్‌ను ఉపయోగించి ఉపాధ్యాయ ఉద్యోగం పొందేందుకు ప్రయత్నించిన ఓ ప్రవాసికి ఖతార్‌లోని లోయర్ క్రిమినల్ కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. శిక్ష పూర్తయిన అనంతరం అతడిని శాశ్వతంగా దేశం నుంచి బహిష్కరించాలని కోర్టు ఆదేశించింది. విద్యా మంత్రిత్వ శాఖ సాధారణ ధ్రువీకరణ ప్రక్రియలో భాగంగా సర్టిఫికేట్‌ను పరిశీలించగా అది నకిలీదని తేలింది. నిందితుడు ప్రైవేట్ పాఠశాలలో ఉద్యోగం పొందేందుకు, అలాగే అధికారిక గుర్తింపు కోసం అదే నకిలీ డిగ్రీని సమర్పించినట్లు అధికారులు గుర్తించారు.
దర్యాప్తులో సాక్షుల వాంగ్మూలాలు, ధ్రువీకరణ నివేదికలు, సంబంధిత విశ్వవిద్యాలయం నుంచి వచ్చిన అధికారిక నిర్ధారణ ఆధారంగా ఆ డిగ్రీని ఆ యూనివర్సిటీ ఎప్పుడూ జారీ చేయలేదని స్పష్టమైంది. దీంతో కోర్టు నిందితుడిని దోషిగా తేల్చి, నకిలీ సర్టిఫికేట్‌ను స్వాధీనం చేసుకోవడంతో పాటు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. శిక్ష అనంతరం అతడిని శాశ్వతంగా ఖతార్ నుంచి బహిష్కరించాలని తీర్పు వెలువరించింది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







