AP ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మేకోవర్ చైర్ పర్సన్ గా మేరుగు తనూజ నియామకం
- July 11, 2026
విజయవాడ: ఎ.పి ఫిలిం ఛాంబర్ మేకోవర్ చైర్ పర్సన్ గా మేరుగు తనూజ నియామకం శుక్రవారం నాడు సీతారాంపురం సిగ్నల్స్ సమీపంలోని యాపిల్ డైయాగ్నోసిస్ నందు జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఉపాధ్యక్షులు డా|| మిక్కిలి ప్రసన్న కుమార్ వర్మ మాట్లాడుతూ ఐదు సంవత్సరాలు మేకప్ నందు విశేష అనుభవం గడించిన తనూజ నియామకం వలన ఛాంబర్ మరింత పేరు ప్రఖ్యాతలు లభిస్తాయని ప్రశంసించారు. అనంతరం జనరల్ సెక్రటరీ చైతన్య జంగా ఆద్వర్యం లో ఈ నియామక పత్రాన్ని అందచేసి కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. అనంతరం ఎ.పి ఫిలిం ఛాంబర్ మేకోవర్ చైర్ పర్సన్ మేరుగు తనూజ మాట్లాడుతూ నన్ను ఈ పదవికి ఎంపిక చేసినందుకు అధ్యక్షులు మంథా శ్రీనివాస్ మరియు జనరల్ సెక్రటరీ చైతన్య జంగా వారికి కృతజ్ఞతలు తెలియ చేశారు. అనంతరం జనరల్ సెక్రటరీ చైతన్య జంగా మాట్లాడుతూ త్వరలో మహిళలకు ఉపాధి కల్పించే దిశలో తనూజ ఆధ్వర్యం లో శిక్షణ తరగతులు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు తెలియ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఎ.పి ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో కార్యక్రమ వివరాలను, ప్రణాళికలను త్వరలో వెల్లడించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఎల్. రాధా రాజేశ్వరి, సభ్యులు ఆర్. వి. అప్పా రావు, ఎమ్. ఈశ్వర రావు, డా|| చిలకపాటి రామ్ చంద్ మరియు తదితర సభ్యులు పాల్గొని తనూజ కి అభినందనలు అందచేశారు.

తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







