స్వీట్ పొటాటో గులాబ్‌జామ్
- July 27, 2015
కావలిసిన పదార్ధాలు
స్వీట్‌పొటాటోస్ - అరకిలో
పంచదార - అరకిలో
యాలికులు - సరిపడా
మైదా - 100గ్రా
కోవా - 200గ్రా
నూనె లేదా నెయ్యి - వేయించడానికి సరిపడా
తయారీ విధానం
చిలగడ దుంపలను ఉడకబెట్టి తొక్క తీసి దానిలో మైదా, కోవా, యాలకుల పొడి వేసి మెత్తగా కలపాలి.తరువాత చేతికి కొద్దిగా నూనె రాసుకుని ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండల్లా పగుళ్లు లేకుండా చేసుకోవాలి. పంచదారలో తగినన్ని నీళ్లు పోసి తీగ పాకం వచ్చే వరకూ మరిగించాలి. దీనిలో కూడా కొంచెం యాలకుల పొడి వేయాలి. ఇప్పుడు చిలగడ దుంప మిశ్రమంతో చేసిన ఉండల్ని ఒక బాణలిలో నూనె గానీ నెయ్యి గానీ వేసి దానిలో చిలగడ దుంప మిశ్రమంతో చేసిన ఉండల్ని దోరగా వేయించి పాకంలో వేయాలి. అంతే గులాబ్ జామ్ రెడీ.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







