సంతృప్తి చెందిన గుర్రం
- July 27, 2015
ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు. ఆ రైతు దగ్గర ఒక గుర్రం ఉండేది. ఆ గుర్రానికి చక్కగా రైతు ఒక కొట్టాన్ని నిర్మించి, దానికి టైంకి తిండి, నీళ్లు చక్కగా పెట్టేవాడు. కానీ ఆ గుర్రానికి ఏ మాత్రం సంతృప్తి ఉండేదే కాదు. దాని కొట్టం బయటే ఒక చెట్టు మీద ఒక పావురం గూడు కట్టుకొని ఉండేది. దాన్ని చూస్తూ గుర్రం అబ్బా ఈ పావురం ఎంత అదృష్టవంతురాలు. హాయిగా దాని రెక్కలతో స్వేచ్ఛగా గాలిలో దానికి కావలిసిన చోటకి కావలసినప్పుడల్లా ఎగురుకుంటూ వెళ్లిపోతుంది. నాకలాంటి స్వేచ్ఛ లేదే అని బాధపడుతూ ఉండేది. ఒకరోజు పెద్ద గాలివాన వచ్చి ఆ పావురం గూడు కొట్టుకు పోయింది. దాంతో పాపం పావురం ఏం చేయాలో తోచక దిగులుగా గుర్రం కొట్టం పైన కూర్చొని చూస్తోంది. దాన్ని చూసి గుర్రం ఎందుకు అలా ఉన్నావ్ అని పావురాన్ని అడిగింది. ఏం చెప్పమంటావ్ గుర్రమన్నా నా బాధ. కట్టుకున్న గూడు చెదిరిపోయింది. తినడానికి తిండి గింజలు కూడా ఎక్కడా దొరకడంలేదు ఈ వానకి. నువ్వు అదృష్టవంతుడివి. నీకు నీ యజమాని అన్నీ సమకూర్చి పెడతాడు. నీకు ఏ కష్టమూ లేదు కదా అని చెప్పసాగింది. దాంతో గర్రానికి కనువిప్పు కలిగి తన యజమాని పట్ల మరింత విధేయతతో ఉంటూ సంతృప్తిగా జీవించసాగింది. అంతే కాక ఆ పావురాన్ని తన కొట్టెంలోనే ఒక మూల గూడు కట్టుకుని ఉండమంది. దాంతో సంతోషంగా ఆ పావురం అక్కడే గూడు కట్టుకుని ఆ రోజు నుండీ అవి రెండూ స్నేహంగా ఉండసాగాయి.
తాజా వార్తలు
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!







