యూఏఈ లాటరీ.. Dh50,000 చొప్పున బహుమతి గెలిచిన ముగ్గురు విజేతలు..!!

- July 12, 2026 , by Maagulf
యూఏఈ లాటరీ.. Dh50,000 చొప్పున బహుమతి గెలిచిన ముగ్గురు విజేతలు..!!

యూఏఈ: యూఏఈ లాటరీ నిర్వహించిన తాజా లక్కీ డే డ్రా శనివారం రాత్రి జరిగింది. ఈ డ్రాలో లక్కీ ఛాన్స్ విభాగంలో ముగ్గురు విజేతలు ఒక్కొక్కరు 50 వేల దిర్హమ్‌లు గెలుచుకున్నారు. 50 వేల దిర్హమ్‌లు గెలుచుకున్న లక్కీ ఛాన్స్ విజేతల ఐడీలు AI0721548, DJ8641131, BA2540127 గా ఉన్నాయి.

యూఏఈ లాటరీలో ప్రతి బుధవారం, శనివారం రాత్రి 9:30 గంటలకు లక్కీ డే డ్రాలు నిర్వహిస్తారు. ఈ డ్రాల్లో పాల్గొనే వారికి Dh30 మిలియన్ గ్రాండ్ ప్రైజ్, Dh5 మిలియన్ రెండో బహుమతి, అలాగే ముగ్గురికి Dh50,000 చొప్పున లక్కీ ఛాన్స్ బహుమతులు గెలుచుకునే అవకాశం ఉంటుంది.

యూఏఈ లాటరీ కార్యకలాపాలను జనరల్ కమర్షియల్ గేమింగ్ రెగ్యులేటరీ అథారిటీ (GCGRA) పర్యవేక్షిస్తోంది. పారదర్శకత, భద్రత, బాధ్యతాయుతమైన గేమింగ్‌కు సంస్థ కట్టుబడి ఉందని నిర్వాహకులు తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com