యూఏఈ ట్రావెల్.. ఏ వస్తువులు తీసుకెళ్లవచ్చు? వేటిపై నిషేధం ఉందంటే?
- July 12, 2026
దుబాయ్: సమ్మర్ పర్యాటక సీజన్ ప్రారంభం కావడంతో జూలై (2026) మొదటి 15 రోజుల్లోనే దాదాపు 30 లక్షల మంది ప్రయాణికులు దుబాయ్ విమానాశ్రయాల గుండా ప్రయాణించవచ్చని దుబాయ్ కస్టమ్స్ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో యూఏఈ (UAE) వెళ్లే ప్రయాణికులు అక్కడి కస్టమ్స్ నిబంధనల ప్రకారం ఏయే వస్తువులను తీసుకెళ్లవచ్చో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
దుబాయ్ కస్టమ్స్ జారీ చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం పూర్తి వివరాలు:
**పన్ను మినహాయింపు ఉన్న వస్తువులు :
వ్యక్తిగత అవసరాల కోసం, వ్యాపార ప్రయోజనాలు లేకుండా క్రింది వస్తువులను పన్ను (Customs Duty) లేకుండా దుబాయ్‌కి తీసుకెళ్లవచ్చు.
* బహుమతులు: 3,000 దిర్హామ్‌ల విలువ లోపు ఉండే బహుమతులు.
* సిగరెట్లు/పొగాకు: గరిష్టంగా 400 సిగరెట్లు, 50 సిగార్లు లేదా 500 గ్రాముల పొగాకు (Tobacco). (వయసు 18 ఏళ్లు పైబడి ఉండాలి).
* ఆల్కాహాల్ : గరిష్టంగా 4 లీటర్ల ఆల్కహాల్ లేదా 2 కార్టన్ల బీర్ (ప్రతీ కార్టన్‌లో గరిష్టంగా 24 కాన్లు, ఒక్కో కాన్ సామర్థ్యం 355 మి.లీ లోపు ఉండాలి).
అనుమతించే వ్యక్తిగత సామాగ్రి:
ప్రయాణికులు తమ వ్యక్తిగత అవసరాల కోసం క్రింది వస్తువులను ఉచితంగా తీసుకెళ్లవచ్చు.
* కెమెరాలు (వీడియో/స్టిల్), ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, పోర్టబుల్ టీవీలు.
* రేడియో సిస్టమ్స్, సీడీ/డీవీడీ ప్లేయర్లు (పరిమిత సంఖ్యలో).
* వీల్ చైర్లు, బేబీ స్ట్రోలర్స్ (పిల్లల బండ్లు), క్రీడా పరికరాలు, మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్స్.
నగదు (Cash Declaration):
* 60,000 దిర్హామ్‌లు(సుమారు US$16,350)) లేదా అంతకంటే ఎక్కువ విలువైన నగదు, విదేశీ కరెన్సీ లేదా ట్రావెలర్స్ చెక్కులను కలిగి ఉంటే కస్టమ్స్ డిక్లరేషన్ ఫారమ్ నింపడం తప్పనిసరి.
* 18 ఏళ్ల లోపు ఉన్న మైనర్లు ఈ పరిమితి కంటే ఎక్కువ నగదు తీసుకెళ్లడానికి వీల్లేదు. వారి వద్ద ఉన్న నగదును వెంట ఉన్న సంరక్షకుడి (Guardian) అకౌంట్‌కు జోడిస్తారు.
మెడిసిన్స్ (Medicines):
* వ్యక్తిగత అవసరాల కోసం గరిష్టంగా 3 నెలలకు సరిపడా మందులను మాత్రమే తీసుకెళ్లాలి.
* దీని కోసం అర్హత కలిగిన డాక్టర్ ఇచ్చిన ఒరిజినల్ ప్రిస్క్రిప్షన్ ఉండాలి (దానిపై స్వదేశంలోని యూఏఈ ఎంబసీ స్టాంప్, సంతకం ఉండాలి). మందులు ఒరిజినల్ ప్యాకింగ్‌లో ఉండాలి, ఎక్స్‌పైరీ కాకూడదు.
* సైకోట్రోపిక్ (Psychotropic) మందులను యూఏఈ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ముందస్తు అనుమతి లేకుండా (ప్రిస్క్రిప్షన్ ఉన్నప్పటికీ) తీసుకెళ్లడం చట్టరీత్యా నేరం.
వీటిపై పూర్తిగా నిషేధం (Banned Items):
* అన్ని రకాల మాదకద్రవ్యాలు (గంజాయి, కొకైన్, హీరోయిన్, గసగసాలు, మత్తు మాత్రలు మొదలైనవి).
* యూఏఈ బహిష్కరించిన (Boycotted) దేశాల నుండి దిగుమతి చేసుకునే వస్తువులు.
* ఏనుగు దంతాలు (Ivory), ఖడ్గమృగం కొమ్ములు.
* గ్యాంబ్లింగ్ (Gambling) ఆడే పరికరాలు, మిషన్లు.
* ఇస్లామిక్ బోధనలకు, నైతికతకు విరుద్ధంగా ఉండే పుస్తకాలు, పత్రికలు, నూనె పెయింటింగ్‌లు, బొమ్మలు, శిల్పాలు.
* నకిలీ కరెన్సీ నోట్లు, త్రీ లేయర్స్ చేపల వేట వలలు, పాత/వాడిన టైర్లు.
*పరిమితి దాటితే ఏం జరుగుతుంది?
అనుమతించిన పరిమితి కంటే అదనంగా ఉన్న వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ పన్ను చెల్లించకపోతే, ఆ వస్తువులను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకుని 30 రోజుల పాటు భద్రపరుస్తారు (మరో 30 రోజులు పొడిగించే అవకాశం ఉంది). ఈ లోగా పన్ను చెల్లించి వస్తువులను తీసుకెళ్లకపోతే, వాటిని దుబాయ్ కస్టమ్స్ బహిరంగ వేలంలో విక్రయిస్తుంది.
*(నోట్: పెంపుడు జంతువులను (కుక్కలు, పిల్లులు) తీసుకురావాలనుకుంటే యూఏఈ పర్యావరణ మంత్రిత్వ శాఖ నుండి ముందస్తు ఇంపోర్ట్ పర్మిట్ తప్పనిసరి).
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్‌పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్‌లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్‌లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్‌లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







