ఫర్వానియా ఫుడ్ హ్యాండ్లర్స్ పరీక్షా కేంద్రం విస్తరణ..!!
- July 14, 2026
కువైట్ సిటీ: ఫుడ్ హ్యాండ్లర్లు మరియు ఇతర వర్గాల ఆరోగ్య పరీక్షల కోసం పనిచేస్తున్న ఫర్వానియా పరీక్షా కేంద్రాన్ని కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ విస్తరించింది. కేంద్రం సామర్థ్యాన్ని పెంచడం, సేవలను మరింత వేగవంతం చేయడం, పెరుగుతున్న సందర్శకుల అవసరాలను తీర్చడం లక్ష్యంగా ఈ కొత్త విభాగాన్ని ప్రారంభించినట్లు తెలిపింది.
కొత్తగా ఏర్పాటు చేసిన విభాగాన్ని మహిళల కోసం ప్రత్యేకంగా కేటాయించారు. దీని ద్వారా ప్రతి సంవత్సరం 35 నుంచి 40వేల మంది వరకు సేవలు పొందే అవకాశం ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఈ విస్తరణతో విజిటర్స్ రాకపోకలు సులభతరం కావడంతో పాటు, విశాలమైన సేవా విభాగాలు, మరింత సమర్థవంతమైన సేవలందించే అవకాశం ఏర్పడుతుందని పేర్కొన్నారు.
కొత్త సదుపాయాల వల్ల రిజిస్ట్రేషన్, వైద్య పరీక్షలు, హెల్త్ ఫిట్నెస్ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియకు పట్టే సమయం తగ్గి, సేవలు మరింత వేగంగా అందుబాటులోకి వస్తాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఇక విస్తరించిన విభాగంలో అత్యాధునిక వైద్య సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఇందులో రిజిస్ట్రేషన్ క్లినిక్‌లు, క్లినికల్ పరీక్ష గదులు, రక్త నమూనాల సేకరణ యూనిట్లు, టీకాల క్లినిక్‌లు ఉన్నాయి. వీటి ద్వారా పరీక్షల ప్రక్రియ వేగవంతం కావడంతో పాటు, నిరీక్షణ సమయం తగ్గి, సేవల సామర్థ్యం పెరిగి, సందర్శకులకు మరింత మెరుగైన అనుభవం కల్పించడంతో పాటు నివారణ ఆరోగ్య సేవల నాణ్యతను కూడా ఉన్నతంగా కొనసాగించనున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- భారత్ నుంచి బహ్రెయిన్‌కు BD111 మిలియన్లకు పైగా దిగుమతులు..!!
- హౌతీ బాలిస్టిక్ మిస్సైల్ దాడిని తిప్పికొట్టిన సౌదీ డిఫెన్స్..!!
- ఒమన్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు.. హెచ్చరిక జారీ..!!
- ఎమర్జెన్సీ వార్నింగ్ సిస్టం దుర్వినియోగం..ఇద్దరికి ఆరు నెలల జైలుశిక్ష..!!
- ఫర్వానియా ఫుడ్ హ్యాండ్లర్స్ పరీక్షా కేంద్రం విస్తరణ..!!
- ఖతార్‌లో వ్యాపార మెరుగుదలకు ప్రైవేట్ కు ప్రోత్సాహం..!!
- వియత్నాం బోటు ప్రమాదం..శంషాబాద్‌కు చేరిన ఏపీ వాసుల మృతదేహాలు
- హైదరాబాద్ లులు మాల్లో గన్ కలకలం
- హోర్ముజ్ జలసంధిలో క్షిపణి దాడి.. భారత నావికుడి మృతిపై యూఏఈలోని భారత రాయబార కార్యాలయం సంతాపం
- కాళేశ్వరం వివాదం పై కేటీఆర్ ఫైర్..







