ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక భేటీ...
- July 14, 2026
న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి తో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ (MoCA), ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI), తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో కలిసి వరంగల్ (మామునూర్), ఆదిలాబాద్ విమానాశ్రయాల అభివృద్ధి పనులను వేగవంతం చేసే అంశాల పై సమగ్రంగా చర్చించారు.
సమావేశంలో వరంగల్ విమానాశ్రయాన్ని కేవలం ప్రయాణికుల రాకపోకలకు మాత్రమే పరిమితం కాకుండా, మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్‌హాల్ (MRO), కార్గో సేవలు, ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ (FTO) వంటి సౌకర్యాలతో కూడిన సమగ్ర ఏవియేషన్ హబ్‌గా అభివృద్ధి చేయాలనే లక్ష్యాన్ని వెల్లడించారు.
అలాగే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపాదించిన 'వికాస్ భీ, విరాసత్ భీ' భావనకు అనుగుణంగా వరంగల్ విమానాశ్రయ టెర్మినల్‌ను స్థానిక కళా, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా నిర్మించనున్నట్లు తెలిపారు.
ఈ ప్రాజెక్టు ద్వారా వరంగల్ ప్రాంతంలోని టెక్స్‌టైల్, ఫార్మాస్యూటికల్ పరిశ్రమలు, ఆలయ పర్యాటకం వంటి రంగాలకు మరింత ప్రోత్సాహం లభించడంతో పాటు ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయని సమావేశంలో అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







