పొరుగు దేశాలతో ఘర్షణ కోరుకోవడం లేదు..ఇరాన్ సైన్యం స్పష్టీకరణ
- July 16, 2026
టెహ్రాన్: మిడిల్ ఈస్ట్లోని పొరుగు దేశాలతో ఘర్షణకు దిగే ఉద్దేశం తమకు లేదని ఇరాన్ సైన్యం స్పష్టం చేసింది. ప్రాంతీయ దేశాలతో సోదరభావ సంబంధాలు, పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికే తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఇరాన్ ఆర్మీ అధికార ప్రతినిధి మొహమ్మద్ అక్రమినియా తెలిపారు.
ఇరాన్ ప్రభుత్వ మీడియా విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, "పొరుగు దేశాలు లేదా ప్రాంతంలోని ఇస్లామిక్ దేశాలతో తలపడాలనే ఉద్దేశం ఇరాన్‌కు లేదు. ప్రాంతీయ దేశాలతో సహకారాన్ని విస్తరించడం, సోదరభావ సంబంధాలను పెంపొందించడానికే ఇరాన్ ఎప్పటికప్పుడు ప్రాధాన్యత ఇస్తోంది" అని పేర్కొన్నారు.
అయితే దేశ భద్రత, జాతీయ ప్రయోజనాలు, ఇరాన్ గౌరవాన్ని కాపాడటం తమ సాయుధ దళాల అత్యున్నత బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. ఆ బాధ్యతను నిర్వర్తించడంలో ఎలాంటి రాజీ ఉండదని, దేశ రక్షణ కోసం అవసరమైన ప్రతి చర్యను తీసుకుంటామని వెల్లడించారు.
కాగా, అంతకుముందు ఇరాన్‌కు చెందిన మరో సైనిక అధికారి, అమెరికా ఇరాన్‌లోని పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటే ప్రాంతీయ మౌలిక సదుపాయాలను "చిత్తు చేస్తాం" అంటూ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో, ఆ వ్యాఖ్యలకు భిన్నంగా ఇరాన్ సైన్యం తాజాగా ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ, ఇరాన్ తాజా ప్రకటనపై అంతర్జాతీయ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!







