మొగుడిని చంపి..కొడుకును పొడిచిన సైకో భార్య!
- July 16, 2026
కర్ణాటకలో వెలుగు చూసిన ఓ ఘటన అందర్నీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. భార్యాభర్తలిద్దరూ సమాజంలో గౌరవప్రదమైన డాక్టర్ వృత్తిలో ఉన్నారు. కానీ అర్ధరాత్రి ఏం జరిగిందో ఏమో.. భర్తను, కత్తితో పొడిచి చంపేసి అంతటితో ఆగకుండా ఎనిమిదేళ్ల కుమారుడిపై కూడా దాడి చేసింది ఒక భార్య ఆ తర్వాత ఏమీ తెలియనట్లు ఇంట్లోనే భర్త శవం పక్కన కూర్చుని ఫోన్ చూసుకుంటూ కాలక్షేపం చేసింది. చుట్టుపక్కల వాళ్లు, బంధువులు వచ్చి అక్కడ సీన్ చూసి అవాక్కయ్యారు. చుట్టుపక్కల వాళ్లు, బంధువులు వచ్చి అక్కడ సీన్ చూసి అవాక్కయ్యారు.
వివరాల్లోకి వెళ్తే.. కిరణ్ హోనన్నవర్, ప్రియాంక భార్యాభర్తలు. వీరిద్దరూ డాక్టర్లే. కిరణ్ అనస్థీషియా స్పెషలిస్ట్ కాగా, ప్రియాంక కంటి వైద్యురాలు. వీరికి ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నాడు. ఈ ఫ్యామిలీ కర్ణాటకలోని ధార్వాడ్‌లో నివాసం ఉంటోంది. అయితే, గత రెండు రోజులుగా కిరణ్‌ను సంప్రదించేందుకు అతడి బంధువులు వరుసగా ఫోన్ కాల్స్ చేస్తున్నారు. కానీ అతడు ఎంతకీ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. కిరణ్ ఫోన్‌ను అతడి భార్య ప్రియాంక లిఫ్ట్ చేసి.. కిరణ్ ఇంట్లో లేడని ఒకసారి, పని మీద బయటకు వెళ్లాడని ఇంకొకసారి పొంతన లేని సమాధానాలు చెబుతూ వచ్చింది.
ప్లాట్‌కు వెళ్లి చూస్తే ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం!
ప్రియాంక సమాధానాలపై అనుమానంతో బంధువులు నేరుగా కిరణ్ ప్లాట్‌కు వెళ్లి చూడగా అక్కడ ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం కనిపించింది. కిరణ్, అతడి కుమారుడు ఇద్దరూ కత్తిపోట్లకు గురై రక్తపు మడుగులో పడి ఉన్నారు. వారి పక్కనే ప్రియాంక ఏమీ తెలియనట్లుగా చాలా ప్రశాంతంగా ఫోన్ చూస్తూ కూర్చొని ఉంది. ఈ భయంకరమైన దృశ్యం చూసిన బంధువులు, పొరుగు వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
కొసప్రాణంతో కొడుకు
హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కిరణ్, అతడి కుమారుడిని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే కిరణ్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించగా.. ఎనిమిదేళ్ల కుమారుడు కొస ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ ఘోరకలిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితురాలు ప్రియాంకను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆమె మానసిక స్థితి సరిగ్గా లేదని, విచారణలో పొంతన లేని సమాధానాలు చెబుతోందని పోలీసులు తెలిపారు. తీవ్రమైన కుటుంబ కలహాల వల్లే ప్రియాంక ఈ దారుణానికి ఒడిగట్టి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.
తాజా వార్తలు
- సినిమా టికెట్ ధరల పెంపు..ఏపీలో రానున్న కొత్త విధానం
- డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- సముద్ర గర్భంలో 500 ప్రాణాలు.. బంగాళాఖాతంలో ఘోర జలసమాధి..
- IRCTC సరికొత్త వెబ్సైట్ లాంచ్..
- మొగుడిని చంపి..కొడుకును పొడిచిన సైకో భార్య!
- పొరుగు దేశాలతో ఘర్షణ కోరుకోవడం లేదు..ఇరాన్ సైన్యం స్పష్టీకరణ
- జనం మధ్యకు జగన్నాథుడు
- భారత్ ఇకపై హార్ముజ్ జలసంధి పై ఆధారపడదు
- యూఏఈ 5 ఏళ్ల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా..
- లంచం అడిగితే ఇవ్వం అని చెప్పండి: సీఎం విజయ్







