డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన గవర్నర్ అబ్దుల్ నజీర్

- July 16, 2026 , by Maagulf
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన గవర్నర్ అబ్దుల్ నజీర్

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఇటీవల ముంబైలో రొటేటర్ కఫ్ శస్త్రచికిత్స చేయించుకున్న నేపథ్యంలో, ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ గురువారం హైదరాబాద్‌లోని పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లి పరామర్శించారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన గవర్నర్, ఆయన త్వరగా పూర్తిస్థాయిలో కోలుకోవాలని ఆకాంక్షించారు. శస్త్రచికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న పవన్ కళ్యాణ్‌కు త్వరితగతిన సంపూర్ణ ఆరోగ్యం చేకూరాలని గవర్నర్ అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు తెలిపారు.

ముంబైలో ఇటీవల పవన్ కళ్యాణ్‌కు భుజానికి సంబంధించిన రొటేటర్ కఫ్ శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించగా, ప్రస్తుతం వైద్యుల సూచనల మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్ స్వయంగా నివాసానికి వెళ్లి పరామర్శించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com