జంట నగరాల్లో నిఘాను పెంచారు

- July 27, 2015 , by Maagulf
జంట నగరాల్లో నిఘాను పెంచారు

పంజాబ్ లోని గురుదాస్ పూర్ లో ఉగ్రవాద దాడుల నేపథ్యంలో హైదరాబాద్ లో హై అలర్ట్ ప్రకటించారు. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, ప్రముఖుల నివాసాలు, కార్యాలయాలు, కీలక ప్రాంతాల్లో భదత్రను కట్టుదిట్టం చేశారు. జంట నగరాల్లో నిఘాను పెంచారు. సోమవారం ఉదయం గురుదాస్ పూర్ లో ఉగ్రవాదులు దాడి చేయడంతో అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోం శాఖ హెచ్చరించింది. ఉగ్రవాద దాడిలో ఎస్పీ బల్జీత్ సింగ్ సహా 13 మంది మరణించినట్టు వార్తలు వెలువడ్డాయి. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com