'హోరా హోరీ' చిత్రం వివరాలు
- July 27, 2015
'అలా మొదలైంది', 'అంతకుముందు ఆ తరువాత' వంటి ఘనవిజయం సాధించిన, వైవిధ్యమైన కధా చిత్రాల నిర్మాణ సంస్థ శ్రీ రంజిత్ మూవీస్. 'చిత్రం, 'నువ్వు నేను', జయం' అంటూ వెండితెరపై ప్రేమ కధా చిత్రాలకు సరికొత్తగా రూప కల్పన చేసి బాక్సాఫీస్ వద్ద రికార్డ్ సృష్టించిన దర్శకుడు తేజ. వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం 'హోరా హోరీ'. నూతన, నటీ నటులతో ప్రేమ కధా చిత్రాలను రూపొందించి, విజయం వైపు అవి ప్రయాణించేలా చేయటం దర్శకుడు 'తేజ' స్టయిల్. ఈ చిత్రాన్నికూడా ఆయన నూతననటీ నటులతోనే తెరకెక్కించారు. ప్రేమ కథాచిత్రంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంత కార్యక్రమాలను జరుపుకుంటోంది. ప్రేమ కథా చిత్రంగా రూపొందుతోన్న ఈ చిత్రానికి కళ్యాణ్ కోడూరి సంగీతం అందించారు. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని జూలై 29న హైదరాబాద్ లోని సైబర్ కెన్వెన్షన్ సెంటర్ లో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు హాజరవుతున్నారు. కొత్త నటీనటులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: కోడూరి కళ్యాణ్, పాటలు: పెద్దాడ మూర్తి, రచనా సహకారం: ఆకెళ్ళ శివప్రసాద్, బాలకుమారన్, కెమెరా: దీపక్ భగవంత్, ఎడిటర్: జునైద్, కాస్ట్యూమ్ డిజైనర్; శ్రీ, స్టంట్స్: పాంథర్ నాగరాజు, నృత్యాలు: శంకర్, కెవిన్, సహ నిర్మాతలు: వివేక్ కూచిభొట్ల, జగన్ మోహన్ రెడ్డి. వి, నిర్మాత: కె.ఎల్.దామోదర్ ప్రసాద్, కధ-స్క్రీన్ ప్లే- మాటలు- దర్శకత్వం: తేజ.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







